amp pages | Sakshi

'మా కుమార్తెలను సన్యాసినులుగా మార్చారు'

Published on Wed, 08/10/2016 - 23:16

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రం వివాదాల్లో చిక్కుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని కోయంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. యోగా కేంద్రంలోని సోదరీమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాలని కోవై ప్రధాన న్యాయమూర్తిని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

పిటిషన్‌లోని వివరాలు.. కోవైకి చెందిన కామరాజ్, సత్యజ్యోతిలకు లత,గీత ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అవివాహితులు. ప్రముఖ యోగా గురువు జగ్గివాసుదేవ్ నేతృత్వంలో కోవై వెల్లియంగిరి కొండ ప్రాంతంలో నెలకొల్పిన ఈషా యోగా కేంద్రానికి ఏడాది క్రితం వెళ్లిన కుమార్తెలు ఇంటికి రాలేదు. వారిని కలుసుకునే అవకాశమూ కల్పించలేదు. తమ కుమార్తెలకు గుండు కొట్టించి సన్యాసినులుగా మార్చిసినట్లు తెలుసుకుని కృంగిపోయాం. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వారిద్దరినీ సన్యాసులుగా మార్చడం చట్టవిరుద్దం. తమ కుమార్తెను విడిపించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. వెంటనే తమ ఇద్దరు కుమార్తెలను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని సత్యజ్యోతి పిటిషన్‌లో పేర్కొన్నారు.

న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి.భారతీదాసన్ ఈ పిటిషన్‌ను బుధవారం విచారించారు. పిటిషన్ దారు కోరినట్లు ఇద్దరు యువతులను హాజరుపర్చాలని ఆదేశించడం లేదు. అయితే కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీని వెంటపెట్టుకుని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈషా యోగా కేంద్రానికి వెళ్లాలి. పిటిషన్‌దారుని ఇద్దరు కుమార్తెలను కలుసుకోవాలి. ఇష్టపూర్వకంగా సన్యాసినులుగా మారారా లేదా బలవంతంగా చేర్చుకున్నారా అనే అంశంపై వారిద్దరి నుంచి పూర్తి వివరాలను సేకరించి గురువారం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అక్కాచెల్లెళ్లు ఇష్టపూర్వకంగానే ఈషాలో చేరినట్లు రుజువైతే హైకోర్టు జోక్యం చేసుకోదని వారు స్పష్టం చేశారు. కేసును గురువారానికి (11వ తేదీ) వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)