amp pages | Sakshi

ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా నిలుపుతాం

Published on Tue, 04/07/2015 - 23:03

ప్రయివేట్ రంగ సంస్థలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
యమునా నదిని శుభ్రం చేయడంలో సహకరించాలి  

 
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాటునందించాలని ప్రైవేటు రంగ సంస్థలను కోరారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు రంగం ఉపాధిని ృసష్టిస్తుందని, అందువల్ల తమ ప్రభుత్వం ఢిల్లీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటోందని చెప్పారు.

జనతా దర్బార్‌లో తనను కలవడానికి వచ్చేవారిలో అత్యధికులు ఉద్యోగమిప్పించాలని కోరేవారేనని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కలిపించడంలో చేయూతనివ్వాలని కోరారు. ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా చూడాలనుకుంటున్నానని అన్నారు. ఆ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం సాధిస్తుందన్న నమ్మకముందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నీటిని రీసైకిల్ చేయడంపై సలహాలివ్వండి

ఇప్పటి వరకు నీటి సమస్యను అధిగమించేందుకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఆ విధంగా కాకుండా ఢిల్లీయే దీనికి స్వయంగా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందన్నారు. నీటిని రీసైకిల్ చేయడానికి తగిన సలహాలిస్తే స్వీకరిస్తామని ఆయన వాణిజ్య వేత్తలను ఆహ్వానించారు. యమునా నది నీటి మట్టం వర్షాకాలంలో పెరుగుతోందని, ఆ నీటిని ఆదా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ నీరు వృథాగా పోకుండా నిల్వ చేయడానికి తగిన మార్గాలు అన్వేషించాలని చెప్పారు. కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని శుభ్రం చేయడానికి సాయపడాలని ప్రయివేటు రంగాన్ని కోరారు. ఘనరూప వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరముందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నగరాన్ని శుభ్రం చేయడం కోసం యంత్రాలను వాడాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. దీని కోసం నిధులను తాము వికేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తద్వారా కాలనీ స్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు.

దేశాన్ని మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చా

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో విబేధాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఆయన నిరాకరించారు. పాలన గురించి మాత్రమే మాట్లాడుతానని చెప్పారు. తాను దేశాన్ని మార్చడానికి రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. కానీ, ఢిల్లీ సమస్యలను పరిష్కరించడానికే చాలా సమయంపడుతోందని, మిగతా విషయాలకు సమయం లేదని పేర్కొన్నారు. టీఆర్‌పీ రేట్లు పెంచుకోవడానికే టీవీ చానెళ్లు ఈ అంశాల గురించి మాట్లాడుతుంటాయని, తాను దృష్టి పెట్టాల్సిన విషయాలు వేరే ఉన్నాయని ఆయన చెప్పారు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)