amp pages | Sakshi

గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే

Published on Mon, 08/17/2015 - 03:39

టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ప్రాబల్యం పెంచుకున్న వాటిలో గూగుల్ ఒకటి. ఇవాళ ఏ కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళైయినా గూగుల్‌ను టచ్ చెయ్యకుండా ఉండలేరు. అంతగా ప్రాముఖ్యతను గూగుల్ సంతరించుకుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య గూగుల్ అన్వేషణలో రెండవ స్థానంలో నిలిచిన నటిగా నటి రాధికా ఆప్తే పేరు నమోదవ్వడం విశేషం. ఇంకా చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఇటీవల కన్ను మూసిన అబ్దుల్ కలామ్ ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానాన్ని  నటి రాధిక ఆప్తే పొందారు.
 
 ఇందుకు కారణాలేమిటన్న విషయం గురించి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఆమె సంచలన ప్రచారాలకు కేంద్ర బిందువు కావడమే నని భావించాల్సి ఉంటుంది. హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన రాధికా ఆప్తే మరాఠీలో నటించిన ధోని చిత్ర తమిళ రీమేక్ ద్వారా ఆమెను నటుడు ప్రకాష్‌రాజ్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత తమిళ్ సెల్వన్ లాంటి  రెండు మూడు చిత్రాల్లో నటించి మంచి ప్రచారమే పొందారు. తెలుగులో బాలక్రిష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఇవన్నీ పక్కన పెడితే రాధికా ఆప్తే హిందీలో సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో అహల్య అనే 13 నిమిషాల లఘు చిత్రంలో పిచ్చపిచ్చగా అందాలారబోశారు.
 
 ఆ చిత్రాన్ని సమీపకాలంలో యూట్యూబ్‌లలో పెట్టారు. రాధికా ఆప్తే శృంగారాన్ని ఒలకబోశారనగానే అవకాశం ఉన్న వారందరూ ఆ లఘు చిత్రాన్ని చూడడానికి గూగుల్‌ను టచ్ చేశారు.అంతకంటే ముందు మరో షార్టు ఫిలింలో రాధికాఆప్తే నగ్నంగా నటించారనే ప్రచారం జరగడంతో అది చూడడానికి గూగుల్ వీక్షకులు విరగపడ్డారు. ఇత్యాది సంఘటనలతో జూలై 22 వరకూ గణాంకాల ప్రకారం గూగుల్ అన్వేషణలో రాధికా ఆప్తే రెండవ స్థానంలో నిలిచారు. ఇప్పటికే ఈ స్థాయిలో ఉంటే త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతున్నారు. ఆ తరువాత రాధికా ఆప్తే హల్‌చల్ ఏ లెవల్‌ల్లో ఉంటుందో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌