amp pages | Sakshi

రైల్వేకు 1100 ఎకరాలు

Published on Thu, 05/28/2015 - 05:21

సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు.

ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్‌కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)