amp pages | Sakshi

కల్వా క్రీక్‌పై సీ లింక్ వంతెన

Published on Sat, 02/15/2014 - 23:29

 సాక్షి, ముంబై: కల్వా-ఠాణేలను అనుసంధానం చేసేలా కల్వా క్రీక్‌పై సీ లింక్ వంతెన నిర్మించేందుకు ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సిద్ధమవుతోంది. సుమారు 2.2 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ.181 కోట్ల వ్యయం అంచనాతో టీఎంసీ అధికారులు ఓ ప్రతిపాదన రూపొందించారు. దీనిని సర్వసాధారణ సభలో ఆమోదించాల్సి ఉంది. ‘కల్వా-ఠాణేలను కలిపే ందుకు ప్రస్తుతం చరిత్రాత్మక పాత వంతెన ఉంది. దీనిపై దాదాపు ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ వంతెన మరమ్మతులు చేపట్టేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది.

ఈ స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలని టీఎంసీ నిర్ణయించింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం టీఎంసీ ఆవిర్భవించక ముందు కల్వా గ్రామాన్ని ఠాణేను అనుసంధానం చేస్తూ 1863వ సంవత్సరంలో బ్రిటిష్ ఈ చరిత్రాత్మక వంతెనను నిర్మించింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న దీనిని హెరిటేజ్ (చారిత్రాత్మక వంతెన)గా ప్రకటించారు. అయితే దీనికి మరమ్మతులు చేపట్టేందుకు కూడా అవకాశంలేకుండా పోయింది.  ఇటీవలి కాలంలో ఈ వంతెనపై నుంచి ముంబ్రా, కల్యాణ్, నవీముంబై, పన్వేల్ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీనికి సమాంతరంగా 1995లో మరో వంతెనను నిర్మించారు.

అయితే ఆ వంతెనపై కూడా తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సమాంతరంగా మరో వంతెన నిర్మాణాన్ని  సాకేత్ వైపు నుంచి చేపట్టాలని టీఎంసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ   ప్రతిపాదన కూడా రూపొందించింది. దీన్ని తొందర్లోనే సర్వసాధారణ సభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. ఆమోదం లభించిన అనంతరం ప్రత్యక్షంగా పనులు ప్రారంభకానున్నాయి. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)