amp pages | Sakshi

అభిమాని అంతిమ కోరిక తీర్చిన శ్రుతి

Published on Mon, 11/03/2014 - 03:40

అభిమానం ఎంత బలమైందంటే కొందరు తమ అభిమాన తారలను పిచ్చగా ప్రేమించేస్తారు.  పూణేకు చెందిన అమ్మాయి సీతల్‌పవర్(17) కేన్సర్‌తో బాధపడుతోంది. ఆమెను వ్యాధి నుంచి బయట పడేయడానికి చివరి వరకు పోరాడిన వైద్యులు ఫలితం లేక చేతులెత్తేశారు. ఇంటికి తీసుకెళ్లి ఆమె చివరి కోరికలు తీర్చే ప్రయత్నం చేయమని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు సీతల్ పవర్ కోరిక తెలుసుకుని షాక్ అయ్యారు. తన అభిమాన తార శ్రుతిహాసన్‌ను ఒకసారి దగ్గరగా చూడాలన్నదే సీతల్ పవర్ చివరి కోరికట.

దీంతో ముంబయిలో యారా చిత్ర షూటింగ్‌లో ఉన్న శ్రుతిహాసన్‌కు మేక్ ఎ విష్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సీతల్ పవర్ చివరి కోరిక గురించి వివరించారు. దీంతో మనసు కరిగిపోయిన శ్రుతిహాసన్ చిత్ర యూనిట్ అనుమతి తీసుకుని వెంటనే పూణేలోని సీతల్ పవర్‌ను ప్రత్యక్షంగా కలిసి ఆమెను ఓదార్చారు. సినిమాలు, ఇతర విషయాల గురించి ఇద్దరు చాలా సేపు ముచ్చటించుకున్నారు. మృత్యువుతో పోరాడుతున్న సీతల్ పవర్ ధైర్యాన్ని శ్రుతి మెచ్చుకుంటూ ఆమె రాసిన ఒక లేఖను ఆమెకు ఇచ్చారు. 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌