amp pages | Sakshi

మరో ‘అణు’ ఆందోళన

Published on Wed, 08/07/2013 - 03:36

కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా చెలరేగిన ఉద్యమం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో మరో ఉద్యమం ఉదయిం చింది. కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు మంగళవారం నిరసన తెలిపారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన మద్రాసు అటామిక్ పవర్ స్టేషన్ (కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం) ఉంది. ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ దీనిని మంజూరు చేశారు. మొత్తం 220 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లతో 1984 జనవరి 24న ప్రారంభమైంది. దేశంలోనే ఇది తొలి అణువిద్యుత్ కేంద్రమని చెబుతారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వల్ప అవాంతరాలు మినహా ఈ కేంద్రం సజావుగా సాగుతోంది. ఈ అనుభవంతోనే కూడంకులంలో మరో అణు విద్యుత్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అణు విద్యుత్ కేంద్రానికి అనుకూలంగా కోర్టులు తీర్పు ఇచ్చాయి. దీంతో ఇటీవలే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది.
 
 అగ్నిపర్వతమంటూ ప్రచారం
 కల్పాక్కం- పుదుచ్చేరికి మధ్యలో అణువిద్యుత్ కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో అగ్నిపర్వతం ఉందనే ప్రచారం జోరందుకుంది. ‘కల్పాక్కం అణుశక్తి కేంద్రం - అగ్నిపర్వతం’ అనే పుస్తకంలో ఈ అంశాన్ని పేర్కొన్నట్లు తెలుసుకున్న స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందని, దీని ప్రభావం అణువిద్యుత్ కేంద్రంపై పడితే గ్రామాలు తుడిచి పెట్టుకుపోగలవని భయపడుతున్నారు. కల్పాక్కం పరిసర గ్రామాల్లోని ప్రజలు మంగళవారం తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. డాక్టర్ పుహళేంది నాయకత్వంలో ప్రజలు ఆందోళనకు దిగారు. 
 
 ఈ వాదనను అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఈ అంశంపై అణువిద్యుత్ కేంద్రం అధికారి ప్రభాత్‌కుమార్ వివరణ ఇచ్చారు. తమిళనాడులో వేలాది ఏళ్లకు ముందు ఆలయాలు, సొరంగాలు ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. సదరు పుస్తకంలో పేర్కొన్నట్లు 250 ఏళ్ల క్రితం అగ్నిపర్వతం ఉన్నట్లు దాఖలాలు లేవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అగ్నిపర్వతాల పరిశోధనల పుటల్లో సైతం కల్పాక్కంలో అగ్నిపర్వతం ప్రస్తావన లేదని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)