amp pages | Sakshi

సమస్యలు పరిష్కరించే వారికే ఓటు

Published on Wed, 04/02/2014 - 03:43

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేగలిగే నాయకునే ఎన్నుకోవాలని మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. అలాంటి నాయకుని హృదయం మంచితనంతో నిండి ఉండాలని కూడా అన్నారు. ఓటర్ల చైతన్యంపై దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం మంగళూరులోని టీఎంఏ పాయ్ కన్వెన్షన్ హాలులో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘యువతతో ముఖాముఖి’ కార్యక్రమంలో  ఆయన పాల్గొని ప్రసంగించారు.
 
చెన్నైలో తాను చదువుతున్నప్పుడు 60 ఏళ్ల కిందట 1954లో తొలిసారిగా తాను మంగళూరుకు వచ్చానని, అప్పట్లో తాను కలసిన మహాబలేశ్వర భట్ మంచి మిత్రుడయ్యారని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే మంగళూరు శుభ్రమైన, అందమైన నగరం అని కొనియాడారు. విజయానికి నాలుగు దశలుంటాయని, విజేత వాటికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉండాలని ఉద్బోధించారు. ‘20 ఏళ్ల వయసు రావడానికి ముందే ప్రతి ఒక్కరూ ఉన్నతమైన ఆశయం కలిగి ఉండాలి.
 
ఆశయం ఒక్కటే సరిపోదు. రెండోది.. పుస్తక పఠ నం ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. మూడోది...బాగా కష్టపడాలి. నాలుగోది..లక్ష్య సాధనకు స్థిరంగా పని చేస్తూ పోవాలి’ అని వివరించారు. ఏ సమస్య గురించైనా భయపడకూడదని, సమస్యే మనల్ని చూసి భయపడాలని అన్నారు. ఏ సమస్యకూ భయపడని లక్షణం నాయకునికి ఉండాలని సూచిం చారు.
 
ప్రతి సమస్యనూ అతను ఓడిస్తూ పోవాలన్నారు. ఆలాంటి నాయకులే మనకు కావాలి. అలాంటి వారినే ఎన్నుకోవాలి అని పిలుపునిచ్చారు. ‘మీరో నిర్ణయం తీసుకోవాలి. దేశం కోసం మం చి నాయకుని ఎన్నుకుని ఓటు వేయాలి. విద్య అనేది ఎగరడానికి రెక్కలనిస్తుందనేదే మీకు నా సందేశం. జ్ఞానం కూడా మిమ్మల్ని మంచి డాక్టరు లేదా ఆర్కిటెక్ట్ లేదా టీచరును చేస్తుంది.
 
మంచి రాజకీయ నాయకుడిని కూడా చేయగలదు’ అని వివరించారు. పెద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయ న విద్యార్థులను అభినందించారు. ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ గంట పాటు సాగిన తన ప్రసంగాన్ని ఆయన ముగించారు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)