amp pages | Sakshi

ఓటరు దేవుని ప్రసన్నం కోసంఆఖరి యత్నాలు

Published on Tue, 04/15/2014 - 02:41

  • నేటితో ప్రచారానికి తెర ..
  •  మండుటెండలో అభ్యర్థుల పోటీ ప్రచారం
  •  జోరుగా పాదయాత్రలు, బైక్ ర్యాలీలు   
  •  కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ సమస్య
  •  సర్వశక్తులూ ఒడ్డుతున్న సీఎం సిద్ధు
  •  పలుచోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులతో లోపాయికారి ఒప్పందాలు
  •  పెద్దగా ప్రభావం చూపని ‘ఆమ్ ఆద్మీ’
  •  ‘మందు’ చూపుతో మద్యం దుకాణాల వద్ద మందు బాబులు క్యూ
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నిలకు మంగళవారం సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు ఓటరు దేవుని ప్రసన్నం చేసుకోవడానికి తుది ప్రయత్నాలు చేస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రధాన పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వివిధ లేఔట్లలో ర్యాలీలు నిర్వహించారు.

    పార్టీ అభ్యర్థుల కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రోడ్డు షోలు, బహిరంగ సభలకు అవకాశం ఉంటుంది. అనంతరం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఉన్నా, అభ్యర్థులు వేరే ‘పనుల్లో’ నిమగ్నమైపోతారు. కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. మంచి ఫలితాలు సాధించకపోతే స్థాన భ్రంశం తప్పదనే అధిష్టానం సంకేతాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్వ శక్తులను ఒడ్డి అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు.

    గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఏక తాటిపై నిలవాల్సిందిగా పార్టీ నాయకులకు ఉద్బోధిస్తున్నారు. ‘సెక్యులర్’ ఓట్లలో చీలిక ఏర్పడి, బీజేపీకి లాభిస్తుందనే చోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులను లోపాయికారిగా తప్పించడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కన్నడ నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థి శివానంద్ నాయక్ చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, బెల్గాంలో పార్టీ అభ్యర్థి నజీర్ భగ్వాన్, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

    మరో రెండు చోట్ల కూడా జేడీఎస్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు పరోక్షంగా మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు మోడీ ప్రభంజనంపై గట్టి ఆశలు పెట్టుకున్న బీజేపీ, కనీసం 20 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఎన్‌డీఏ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలనుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు తమ ఓట్లకు గండి కొడతారని తొలుత భయపడిన బీజేపీ అభ్యర్థులు, క్రమేణా ఆ పార్టీ ప్రభావం బలహీన పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా గురువారం ఒకే దశలో రాష్ర్టంలోని మొత్తం 28 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగనుంది.
     
    ‘మందు’ చూపు
     
    ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలోని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మూడు రోజుల పాటు మూసి వేయనున్నారు. ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపిస్తుండడంతో గతంలో లాగా మద్యం దుకాణాలను మూసి వేసినా విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మందు బాబులు అప్పు సొప్పో చేసి మూడు రోజులకు సరిపడా మద్యాన్ని స్టాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బార్లు సైతం ‘రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి గురువారం వరకు షాపులు మూసివేయబడును’ అని బోర్డులు వేలాడదీసి మందు బాబులను మరింత ‘అప్రమత్తం’ చేస్తున్నాయి.
     

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)