amp pages | Sakshi

మెజారిటీ ఏకగ్రీవాలు టీఆర్‌ఎస్‌లోకే 

Published on Wed, 02/12/2020 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: సహకార ఎన్నికల నామినేషన్లు, ఉప సంహరణ ప్రక్రియ సోమవారం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచారంపై దృష్టి సారించారు. ఈ నెల 15న ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) పరిధిలోని డైరెక్టర్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 904 పీఏసీఎస్‌ల పరిధిలోని 11,653 డైరెక్టర్‌ స్థానాలకు సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రాష్ట్రంలోని 156 పీఏసీఎస్‌ల పరిధిలోని డైరెక్టర్‌ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి.

అత్యధికంగా ఖమ్మంలో.. 
అత్యధికంగా ఖమ్మంలో 34, నిజామాబాద్‌లో 26 సొసైటీల పరిధిలో డైరెక్టర్‌ స్థానాలన్నీ ఏకగ్రీవ మయ్యాయి. కామారెడ్డిలో 12, ఆదిలాబాద్‌లో 11, సూర్యాపేటలో 9, సంగారెడ్డిలో 8, మంచిర్యాల, జగిత్యాల, మెదక్‌ జిల్లా పరిధిలో ఐదేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. కుమరంభీమ్‌ ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, వికారాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో మూడు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్‌ అర్బన్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్, ములుగు జిల్లాలో రెండేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్, కరీంనగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో సొసైటీ ఏకగ్రీవం కాగా, జోగుళాంబ గద్వాల, యాదా ద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కా జిగిరి జిల్లాల్లో మాత్రం అన్ని సొసైటీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 5,387 డైరెక్టర్‌ స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది.

లెక్కలు వేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ 
అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని గతేడాది జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్‌ఎస్‌ సహకార ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పీఏసీఎస్‌ల పరిధిలో వీలైనంత మేర డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యేలా చూడటం ద్వారా అనుచరులకు పదవులు దక్కేలా చూడటంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులకు ఒకటి రెండు డైరెక్టర్‌ స్థానాలివ్వడం ద్వారా మొత్తం సొసైటీ పరిధిలో ఏకగ్రీవమయ్యేలా పావులు కదిపారు.

మెజారిటీ పీఏసీఎస్‌లో డైరెక్టర్, చైర్మన్‌ పదవులు దక్కేలా టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. జిల్లాల వారీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్, పీఏసీఎస్‌లపై నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన డైరెక్టర్‌ స్థానాలకు సంబంధించి పార్టీల వారీగా వివరాలు సేకరించి నివేదికలు సమర్పించారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు పూర్వపు జిల్లా పరిధిలో పర్యటిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)