amp pages | Sakshi

36 గంటలు.. 820 మరుగుదొడ్లు

Published on Wed, 12/28/2016 - 03:19

జగిత్యాల జిల్లాలో కలెక్టర్‌ శరత్‌ వినూత్న ప్రయోగం
ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభం
పనుల తీరుపై.. స్వచ్ఛభారత్‌ మిషన్‌ డాక్యుమెంటరీ
నేటి రాత్రి 8:20కి మొత్తం పనులు పూర్తి


సాక్షి, జగిత్యాల: స్వచ్ఛ భారత్‌.. స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తితో జగిత్యాలనూ స్వచ్ఛ జిల్లాగా లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ వినూత్న ప్రయోగంతో ముందుకు సాగుతున్నారు. కేవలం 90 రోజుల్లోనే జగిత్యాలను స్వచ్ఛ జిల్లాగా మార్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా 36 గంటల్లో 820 మరుగు దొడ్ల నిర్మాణ లక్ష్యం పెట్టుకున్న ఆయన మంగళవారం ఉదయం సరిగ్గా 8:20 గంటలకు జిల్లాలోని మల్లాపూర్‌ మండలం నడికుడ గ్రామంలో పనులు ప్రారంభించారు. అదే సమయంలో నిర్ణయించిన మిగతా గ్రామా ల్లోనూ పనులు ప్రారంభించారు. పనుల పర్య వేక్షణకు సంబంధించి కలెక్టర్‌ ఐదు మరుగు దొడ్లకు గ్రామస్థాయి అధికారి, పది మంది గ్రామస్థాయి అధికారులపై మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

దీంతో పాటు ఇప్పటికే ఒక్కో గ్రామానికి నియ మించిన జిల్లాస్థాయి అధికారులూ తమకు కేటాయించిన గ్రామాల్లో నిర్మాణ పనులు పర్యవేక్షించారు. కలెక్టర్‌ సైతం..విశ్రాంతి లేకుండా తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. బుధవారం రాత్రి 8:20 గంటలలోపు నిర్మాణ లక్ష్యం పూర్తి చేసి.. గ్రామాన్ని సంపూర్ణ మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా తీర్మానం చేయాలని పంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొ ని అధికారులకు మద్దతుగా నిలబడ్డారు.

300 నిర్మాణాలు పూర్తి
గత నెల 15 నుంచే నియోజక, మండల, గ్రామ స్థాయి సమావేశాలు.. సమీక్షలు నిర్వహించిన ఆయన మరుగు దొడ్లు లేని లబ్ధిదారులను  గుర్తించి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిం చారు. కలెక్టర్‌ కృషి ఫలితంగా.. ఇన్నాళ్ల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ధ చూపని నిరుపేద, నిరక్షరాస్యులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకొచ్చారు. కూలీలతో పాటు లబ్ధిదారులు సైతం పనుల్లో చేయందించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు జరిగిన పనుల ఆధారంగా.. అర్ధరాత్రి వరకు..(16 గంటల్లో) జిల్లావ్యాప్తంగా మూడొందల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. నేటి రాత్రి 8:20 గంటలలోపు.. మిగతా నిర్మాణాలు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)