amp pages | Sakshi

పాలన.. కొత్త పుంతలు

Published on Wed, 10/04/2017 - 01:21

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పాలన కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, శాఖాపరమైన పురోగతి నివేదికలతో పాటు పర్యవేక్షణ కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. ఇటీవల జిల్లాల సంఖ్యతో పాటే అన్ని శాఖల్లోనూ జిల్లా అధికారుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో జిల్లాస్థాయి అధికారులతో సమన్వయం, సూచనలు, ఆదేశాల జారీ, పర్యవేక్షణ వంటివి సజావుగా సాగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయి. అధికారులకు రోజువారీ కార్యకలాపాలపై అందులోనే సలహాలు, సూచనలిస్తూ క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి.

ఇలా నిర్ణయం.. అలా అమలు
గతంలో రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరాలంటే చాలా సమయం పట్టేది. నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు పోస్టు ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో పంపేవారు. ఆ పరిస్థితికి స్వస్తి పలుకుతూ వాట్సాప్‌ గ్రూపుల్లో నేరుగా ఉత్తర్వుల కాపీలను పంపుతున్నారు. అంతేకాకుండా శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలు, పురోగతి అంశాలను సైతం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో ప్రత్యేకంగా ఒక డిప్యూటీ డైరెక్టర్‌ వాట్సాప్‌ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు.

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని నిమిషాల్లో చేరవేస్తున్నారు. ఒక విధంగా గ్రూపు సభ్యులకు సంబంధిత వాట్సాప్‌ గ్రూపును అనుసరించడం రోజువారీ విధుల్లో భాగమైపోయింది. ఇదే తరహాలో గిరిజన సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖలు సైతం రాష్ట్రస్థాయి వాట్సాప్‌ గ్రూపులను నిర్వహిస్తున్నాయి.

పక్కాగా నిర్వహణ
రాష్ట్ర శాఖలు తమ వాట్సాప్‌ గ్రూపుల నిర్వహణలో జాగ్రత్త వహిస్తున్నాయి. వీటిలో రాష్ట్ర శాఖ కమిషనర్‌/డైరెక్టర్, ఆ తర్వాత స్థాయిలో ఉండే అదనపు డైరెక్టర్, జాయింట్‌ డైరెక్టర్‌లతో పాటు జిల్లా అధికారులు మాత్రమే ఉంటారు. ఒక నిర్ణయాన్ని గ్రూప్‌లో అప్‌డేట్‌ చేసిన వెంటనే దాన్ని జిల్లా స్థాయి అధికారులు (గ్రూప్‌ సభ్యులు) అందరూ చూశారా.. లేదా.. అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా సమాచారాన్ని చూడనట్లు గుర్తిస్తే వెంటనే వారికి ఫోన్‌ చేసి మరీ విషయాన్ని చేరవేస్తున్నారు. దీంతోపాటు నిర్ణయాలను ఆయా అధికారుల మెయిల్‌ ఐడీలకు సైతం పంపుతున్నారు.

అయితే అధికారులు కార్యాలయంలోనే కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నా వాట్సాప్‌ ద్వారా చూడడం సులభతరం కావడంతో ఉన్నతాధికారులు దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గోప్యమైన అంశాలేమైనా ఉంటే.. వాటిని సదరు అధికారి వ్యక్తిగత వాట్సాప్, ఈ–మెయిల్‌కు పంపుతున్నారు. శాఖాపరమైన వాట్సాప్‌ గ్రూప్‌ను కార్యాలయ పనివేళల్లో తప్పనిసరిగా అనుసరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం గమనార్హం.

సులభం.. కచ్చితం కూడా..
గతంలో పది జిల్లాలున్నప్పుడు సమాచారం ఇవ్వాలంటే ఫోన్‌ చేసేవాళ్లం. జిల్లాల సంఖ్య పెరగడంతో ఫోన్‌లో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాం. ఇందులోనే అన్నీ వివరిస్తున్నాం. జిల్లా స్థాయి అధికారులు దీంతో సకాలంలో స్పందిస్తున్నారు. – వి.సర్వేశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)