amp pages | Sakshi

లూజు మద్యం.. కల్తీ తథ్యం!

Published on Tue, 03/10/2015 - 00:29

ఎక్సైజ్ ఉన్నతాధికారుల దాడుల్లో బహిర్గతం
4 షాపుల్లో కల్తీమద్యం విక్రయం

 
మహబూబాబాద్ : మానుకోటలో మద్యం కల్తీ పరంపర కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎక్సైజ్ అధికారులే దీనికి ఊతమిస్తున్నారనే ఆరోపణ బలంగా విన్పిస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే గాని క్షేత్రస్థారుులో కదలిక రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ తరహాలోనే ఇటీవల పలు షాపులు సీజ్ అయ్యూరుు. పట్టణంలో 13 మద్యం దుకాణాలున్నారుు. అన్నింటికీ పర్మిట్ రూములున్నారుు. కానీ నిబంధనలను వీరు విస్మరిస్తున్నారు. లూజు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ధరల పట్టిక ఏర్పాటు చేయకుండా అడ్డగోలుగా ధర పెంచి అమ్ముతున్నారు. అర్ధరాత్రి వరకు వైన్స్‌లు తెరిచే ఉంటున్నారుు. అధికారులకు మామూళ్లు ఇచ్చేందుకే తాము అధిక ధరలు వసూలు చేస్తున్నామని వైన్స్ యజమానులే చెబుతున్నారు.

దాడుల పరంపర

గతేడాది మార్చి 8న ఎక్సైజ్ డీసీ నర్సిరెడ్డి పట్టణంలోని పలు వైన్స్‌లపై అకస్మాత్తుగా దాడులు చేశారు. షాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా అది కల్తీ మద్యమని తేలింది. రెండు షాపులను సీజ్ చేసినా యజమానులు జరిమానా చెల్లించి మళ్లీ తెరిచారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప దాడులు చేపట్టడం లేదు. ఇటీవల కురవి రోడ్‌లోని తెలంగాణ, అంజనా వైన్స్‌పై దాడులు చేసి లూజు మద్యాన్ని సేకరించారు. తెలంగాణ వైన్స్‌లోని లూజు మద్యం కల్తీ అని తేలడంతో సీజ్ చేశారు. ఈ నెల 8న పట్టణంలోని జై అంజనా వైన్స్‌పై ఈఎస్‌టీఎఫ్ ఏఈపీ శ్రీనివాసరావు, సీఐ చంద్రశేఖర్ దాడి చేసి కేసు నమోదు చేశారు. ఇక్కడి మద్యం కల్తీదని ల్యాబ్ రిపోర్టులో తేలితే ఆ షాపుపైనా చర్యలు తప్పవని తెలిసింది.

సిబ్బంది ఉన్నా కదలరేం?

ఇలా వరుసగా కల్తీ కంపు బయటపడుతున్నా.. స్థానిక ఎక్సైజ్ అధికారులు మాత్రం వైన్స్ నిర్వాహణ సక్రమంగానే ఉందనడం వారి గమనార్హం! పట్టణంలో ఎక్సైజ్ సీఐ కార్యాలయంతో పాటు ఈఎస్ కార్యాలయం ఉంది. సిబ్బంది సరిపడా ఉన్నారు. అరుునా దాడులకు పూనుకోవడం లేదు.  గుడుంబా స్థావరాలపై దాడులు చేస్తూ వైన్స్‌ను మాత్రం విస్మరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వారి గుడుంబా కేంద్రాలపై మాత్రమే దాడులు చేస్తున్నారనే ఆరోపణా ఉంది.  మానుకోటలో లారీల కొద్ది బెల్లం దిగుమతి అవుతున్నా ఎక్సైజ్ అధికారులు అడ్డుకోవడం లేదు. నల్లబెల్లం, పటి క విక్రయించే దుకాణదారులపైనా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్థానిక ఎక్సైజ్ అధికారులపై చర్యలు చేపట్టాలని, తర్వాతే అక్రమ మద్యం దందా, బెల్లం వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)