amp pages | Sakshi

సర్వం సిద్ధం

Published on Tue, 03/28/2017 - 15:01

► ఉమ్మడి జిల్లాలో 74 కేంద్రాలు
► హాజరుకానున్న 49,000 మంది ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు
► తొలిసారి ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం
 
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలో 74 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 49 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం విధానంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
కోదాడ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో అధికారులు, కళాశాలల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటిసారి ఆన్‌లైన్‌ విధానంలో ప్రశ్నపత్రాలను ప్రవేశ పెడుతున్నందున ఇటు అధికారులతోపాటు, అటు పరీక్ష కేంద్రాల నిర్వాహకుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈమేరకు చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు శనివారం అవగాహన కల్పించారు. తొలి పరీక్ష రోజు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
 
సెంటర్లెక్కువ.. విద్యార్థులు తక్కువ
ఆన్‌లైన్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 49వేల మంది హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలో 300 మందికి మించకుండా పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్‌ చేయడం, ప్రింట్‌అవుట్స్‌ తీయడం సమస్య ఉండదని అధికారులు అంటున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలు ఒకటి రెండు పేజీలు మాత్రమే ఉంటున్నందున పెద్ద ఇబ్బంది ఉండదని, కామర్స్‌ మాత్రం ఐదారు పేజీలు ఉండే అవకాశం ఉన్నందున కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దానిని అధిగమించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు నిర్వాహకులకు సూచిస్తున్నారు.
 
8.45 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం.. 9 గంటలకు పరీక్ష..
యూనివర్సిటీ అధికారులు ప్రతి పరీక్షకు 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో ఉంచుతారు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ప్రతి సెంటర్‌కు ఒక పాస్‌వర్డ్‌ ఇస్తారు. అది తెలిసిన చీఫ్‌ సూపరింటెండెంట్‌ సమక్షంలో ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థుల సంఖ్యమేరకు ప్రింటవుట్లు తీసి 9 గంటల వరకు పరీక్షను ప్రారంభించాలి. ఒక ప్రింటర్‌పై నిమిషానికి 20 నుంచి 25 వరకు ప్రింట్లు తీసే అవకాశం ఉన్నందున్న ఎక్కువ మంది విద్యార్థులున్న సెంటర్లలో రెండు ప్రింటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష పత్రాలను డౌన్‌లోడ్‌  చేసుకోవడంలో గానీ, ప్రింటవుట్లు తీసుకోవడంలోగానీ ఎమైనా ఇబ్బందులు ఎదురైతే ఐదు పది నిమిషాలు ఆలస్యంగానైనా పరీక్షను ప్రారంభించుకోవచ్చని, దానికి అనుగుణంగా చివరల్లో ఆ మేరకు  అదనపు సమయాన్ని విద్యార్థులకు కేటాయించాలని అధికారులు చెప్పినట్లు సమాచారం.
 
కానీ వీలైనంతలో అనకున్న సమయానికి పరీక్షను ప్రారంభించడానికే కృషి చేయాలని, తప్పనిసరి, సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పడు మాత్రమే ఐదు పది నిమిసాలు ఆలస్యంగా ప్రారంభించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)