amp pages | Sakshi

డెయిరీలో దేశముదురు

Published on Wed, 04/20/2016 - 01:28

ఓ అధికారి యథేచ్ఛ దోపిడీ
‘పాలు’పంచుకుంటున్న
నలుగురు సిబ్బంది

 

ఉన్నత ఉద్యోగం..  నెలకు అర లక్ష వేతనం. అయినా.. సంపాదనపై  ఆశ చావలేదు. కోట్లు గడించాలని ఆ యువరక్తం తహతహలాడింది. అందుకు కిందిస్థాయిలో మరో నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎంచుకున్నాడు. అన్నీ నేను చూసుకుంటా.. రికార్డుల పరంగా సహకరిస్తే చాలు.. మీ వాటా మీదే అన్నాడు. అరకొర వేతనంతో బతుకుతున్న వార ఆయన ఆఫర్‌కు ఓకే చెప్పారు. ఇలా వారి అక్రమార్జన మూడు లీటర్ల పాలు.. ఆరు కిలోల నెయ్యిలా సాగిపోతోంది. 

 

 హన్మకొండ చౌరస్తా : హన్మకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని విజయ డెయిరీకి ప్రతి రోజూ జిల్లాలోని పాడి రైతుల నుంచి సుమారు 60 వేల లీటర్ల పైచిలుకు పాలు వస్తుంటాయి. ఇలా వస్తున్న పాలలో వెన్న శాతం గుర్తించి శీతలీకరణ చేస్తారు. అనంతరం పాలను ప్యాకెట్లలో నింపి విక్రరుుస్తారు. పాల నుంచి తీసిన వెన్న ను నెయ్యిగా మార్చి అమ్మకాలు చేస్తుంటారు. ఇది ప్రతీరోజు సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ కార్యక్రమాలను ప్రతి రోజు పర్యవేక్షించి పాల కొనుగోలుతో పాటు అమ్మకాలు సక్రమంగా జరిగేలా చూడాల్సిన అధికారి అక్రమాలకు తెరలేపాడు. ఎనిమిదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఆ అధికారి డెరుురీపై మంచి పట్టు సాధించాడు. ఎక్కడ ఎలా మోసాలకు పాల్పడవచ్చో తెలుసుకున్నాడు. తన అక్రమార్జనకు డెయిరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసుకున్నాడు. అందులో మార్కెటింగ్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, డిస్పాచ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నారు.

 

అక్రమాలు ఇలా..

ప్రతి రోజు 60 వేల లీటర్ల పాలు సేకరిస్తుం డగా శీతలీకరణ చేసి 30 వేల లీటర్లు ప్యాకెట్ల రూపంలో అమ్మకాలు జరుగుతున్నట్లు, మరి కొన్ని పాలు నెరుు్య తయూరీకి ఉపయోగిస్తున్నట్టు డెయిరీ అధికారులు చెబుతున్నారు. అక్రమ సంపాదనపై దృష్టిపెట్టిన సదరు అధికారి అనధికారికంగా వెన్న శాతాన్ని తక్కువగా చూపి కొన్ని లీటర్ల పాలను పక్కనబెడుతున్నాడు. వాటితో తయారైన  పాల ప్యాకెట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. పాలలో వెన్న శాతాన్ని తక్కువగా చూపడం వల్ల శీతలీకరణలో పాలు ఎక్కువగా ఆవిరైనట్టు లెక్క రాయవచ్చు. ఇలా ప్రతీ రోజు 300 లీటర్ల పాల ప్యాకెట్లను అక్రమంగా అమ్ముకుంటున్నాడు. లీటరుకు మార్కెట్‌లో రూ. 36 ఉండగా.. సదరు అధికారి రూ. 30కే విక్రయిస్తున్నట్లు తెలిసింది. అంటే  ఈ లెక్కన ఒక్క రోజు సంపాదన రూ. 9వేలు అన్నమాట. ఇందులో కష్టపడుతున్నందుకు సగం బాస్ తీసుకుని.. మిగతా సగంలో ఆ నలుగురుకి వాటా ఇస్తున్నాడు. పాలలో వెన్న శాతాన్ని తక్కువగా చూపి, మిగిలిన శాతాన్ని వీరి ఖాతాలో వేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ సహకరిస్తాడు. పాల దిగుమతి, పాల ప్యాకెట్ల ఎగుమతిలో తేడా చూపించడం డిస్పాచ్ సూపర్‌వైజర్ పని. మిగిలిన ఇద్దరు ఉద్యోగుల రికార్డుల్లో తేడా రాకుండా.. మార్కెటింగ్ సాఫీగా సాగేలా చూస్తారు.

 
నెరుు్య అమ్మకాల్లోనూ..

ఇక నెయ్యి విషయానికొస్తే డెయిరీలో ప్రధాన ద్వారం వద్ద గల అధికారిక కౌంటర్ ద్వారా ప్రతి రోజూ 200 కిలోల నెయ్యి అమ్ముడుపోతుంది. అందులో 10 కిలోల నెయ్యి సదరు అధికారిదే. ఒక్క కిలో నెయ్యి ధర రూ.320 ఉంది. ఆ లె క్కన రోజుకు రూ.3 వేలు గడిస్తున్నాడు. నెయ్యి అమ్మకాలను కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉండగా.. అదనపు సంపాదన వస్తుండడంతో డెయిరీలోనే కాంట్రాక్ట్ ఉద్యోగికి కౌంటర్‌ను అప్పగించినట్లు తెలిసింది. ఇవే కాకుండా పాల నుంచి తీసిన వెన్న విక్రయూల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ సంపాదనకు మరిగిన ఈ అధికారి గతంలో ఓసారి బదిలీ అయినా రాజకీయ పలుకుబడితో రద్దుచేయించుకున్నట్లు డెయిరీ సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా పైస్థాయి అధికారిణిపై పలు ఆరోపణలతో బదిలీ చేయించినట్లు తెలిసింది. ఆ స్థానంలో మరో ఉన్నతస్థాయి అధికారి వచ్చినప్పటికీ అతన్ని సైతం మచ్చిక చేసుకున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. అక్రమ సంపాదనతో ఇప్పటికే మూడు చోట్ల బహుళ అంతస్థుల ఇళ్ళను నిర్మించుకుని ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈయనకు సాయం చేస్తున్న ఆ నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులు సైతం విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నట్లు తెలిసింది.

 

 ఆరోపణలు వినిపిస్తున్నాయి..
ఇటీవల డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. అదే నిజమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధం. వరంగల్ డెయిరీలో అక్రమాలకు తావేలేదు. గతంలో నెయ్యి కౌంటర్‌కు టెండర్లు పిలిచింది వాస్తవమే. ప్రస్తుతం మేమే నిర్వహిస్తున్నాం. నిజారుుతీగా, అభివృద్ధి కోసం పనిచేసే అధికారులపై విమర్శలు చేయడం సరైంది కాదు.  - వెంకట్‌రెడ్డి,  విజయ డెయిరీ, డిప్యూటీ డెరైక్టర్

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌