amp pages | Sakshi

కరువు మండలాలను ప్రకటించాలి: నాగం

Published on Thu, 12/11/2014 - 02:39

నాగర్‌కర్నూల్‌టౌన్:  టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకుండా మీనమేషాలు లెక్కించడం తగదని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్ర భుత్వం నివేదిక పంపిన తర్వాతనే కేంద్ర  బృందం జిల్లాలో పర్యటించి పరిస్థితిని పరిశీలిస్తుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి జిల్లాలోని గుడిపల్లి, జొన్నలబొగుడ రిజ ర్వాయర్లను పరిశీలించి వెళ్లారే తప్ప పనులు ప్రారంభించలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలను భయపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే అయ్యప్ప సొసైటీని కూ ల్చివేసేందుకు నిర్ణరుుంచిందన్నారు. మెట్రో రైలు, వినాయక్ సాగర్‌లపై చూపుతున్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాలపై కూడా చూపాలని కోరారు.
 
 మార్కెట్ యార్డుల్లో మద్దతు ధర లేక, సంచులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి లిఫ్టులో సంప్‌హౌస్, సర్జిఫుల్ లో నాసిరకం పనులు చేశారని, మూడో లిఫులో ఎనిమిది నెలలుగా పనులు ఆగిపోయాయన్నారు.  గతంలో పింఛన్ అందుకున్న ప్రతి వృద్ధురాలికి పింఛన్ అందజేయాలన్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు నమోదు చేయించుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, కాశన్న, బాలగౌడ్, షఫి, నసీర్, తదితరులు ఉన్నారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)