amp pages | Sakshi

వైఎస్‌ జగన్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు  

Published on Sat, 12/22/2018 - 01:33

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నా’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘ వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా నా శుభాకాంక్షలు’ అని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు, ‘యువనేత వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ‘జగన్‌ ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని మనçస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మంత్రి గంటా ట్వీట్‌ చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌  కుమార్తె, ఎంపీ కవిత ‘జగనన్నా.. మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ దిడే’ అని శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు, మీకు ఆ దేవుడు సుఖసంతోషాలతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ఇండియా టీవీ చీఫ్‌ ఎడిటర్, చైర్మన్‌ రజత్‌ శర్మ ట్వీట్‌ చేశారు. సినీ హీరో సుమంత్‌ కూడా వైఎస్‌ జగన్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్‌ జగన్‌ గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు.. మీకు ఏపీ ప్రజ లకు ఈ ఏడాది ప్రత్యేకంగా ఉంటుందని నేను  చెబుతున్నాను’ అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ, సినీ ప్రముఖులకు, పార్టీ నాయకులకు, శ్రేణులకు, మీడియా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఇంత ప్రేమ, ఆదరాభిమానాలు చూపించడం అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్‌ చేశారు.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)