amp pages | Sakshi

'రసం'లో విషం!

Published on Wed, 05/27/2020 - 10:52

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మామిడి పండ్లు మధురం కాదు విషం. అవును మీరు విన్నది నిజమే. ఫల రాజుకు కార్భైడ్‌ సెగ తప్పడం లేదు. వేసవిలో మాత్రమే లభించే  మామిడి పండ్లు విషపూరితంగా మారిపోయాయి. మామిడి కాయలు పక్వానికి రాకముందే  తెంపి కారై్బడ్‌తో  మాగ పెట్టడంతో కేవలం ఒక రోజులోనే పండుగా మారుతున్నాయి. దీంతో  పండ్లను తినాలనుకుంటున్న ప్రజలు డబ్బులుచెల్లించి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నట్లుఅవుతోంది.

కార్బైడ్‌ వాడితే కఠిన చర్యలు
మామిడి పండ్లు పండించడం కోసం ఎవరూనా కార్బైడ్‌ వాడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. వీటితో పాటుగా ఇతర పండ్లను మాగపెట్టడానికి కార్బైడ్‌ వాడరాదు. వీటిని విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఈ కార్బైడ్‌తో శరీరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందువలన పండ్లను విక్రయించే వారు ఈ కార్బైడ్‌ను వాడకుండా సాధారణ పద్ధతుల్లో పండ్లను మాగపెట్టాలి. –రవీందర్‌రావు, జిల్లా ఆహార భద్రత అధికారి, సిద్దిపేట

మామిడి కాయలను చెట్ల పైనే పక్వానికి వచ్చే వరకు ఉంచినట్లయితే ఆ పండ్లు మధురంగా ఉంటుంది. అలా కాకుండా గడ్డిలో మాగ పెట్టినా కుడా ఆపండ్లు రూచిగానే ఉంటాయి. కానీ గడ్డిలో పెట్టి పండించాలంటే 3–5రోజుల సమయం పడుతుంది. దీంతో రైతులతో నాటుగా తోటలను గుత్తకు తీసుకున్న వ్యాపారస్తులు  జిలాల్లోని మామిడి తోటల నుంచి,  ఇతర జిల్లాల నుంచి కుడా మామిడి కాయలను దిగుమతి చేసుకుంటూ రసాయానాలతో మాగపెడుతున్నారు. దీంతో వేసవి ప్రారంభం నుంచే విషమున్న మామిడి పండ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కార్భైడ్‌ వాడకాన్ని నిషేధించింది. దీనికి బదులుగా ఇథిలీన్‌ గ్యాస్‌తో మామిడి పండ్లను మాగపెట్టవచ్చు. ఈ ఇథిలీన్‌తో మాగ పెట్టిన  పండ్లు, సహజసిద్ధంగా గడ్డిలో మాగపెట్టిన పండ్లలాగే నాణ్యమైనవి. 

కార్బైడ్‌ పండ్లు వలన కలిగే నష్టాలు...
కార్బైడ్‌తో పండించిన పండ్లతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్సర్,  కాలేయం, క్యాన్సర్, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల బలహీనతలతో పాటుగా దీర్ఘకాలిక‡ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో సహజసిద్ధంగా మాగపెట్టిన మామిడి పండ్లను తినడం మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. మామిడి పండ్లను కార్బైడ్‌తో కాకుండా ఇథిలీన్‌ గ్యాస్‌ సహాయంతో కుడా మాగపెట్టవచ్చు. కానీ దీని నిర్వహణ ఖర్చుతో కుడుకున్నవి. దీంతో వ్యాపారస్థులు తక్కువ ఖర్చు ఉన్నటువంటి కార్బైడ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.  అనారోగ్యాలకు తలుపులు తెరుస్తున్నారు.

కార్బైడ్‌ పండ్లను ఇలా గుర్తించవచ్చు......
కార్బైడ్‌తో పండిన పండ్లు చాలా శుభ్రంగా చుడగానే నాణ్యమైనవిగా నిగనిగలాడుతూ కనపడుతాయి. వీటిపై ఆకుపచ్చని మచ్చలుంటాయి. అధికంగా పసుసు పచ్చని రంగును కలిగి ఉంటాయి. ఈ పండ్లు తినేటప్పుడు నోట్లో కొంచెం దురదగా(మంటగా) ఉంటుంది. ఈ పండ్లలో రసం తక్కువగా ఉంటుంది.  ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ కార్బైడ్‌ మామిడి పండ్లను తినేటపుడు వాటి తోలును మాత్రం అసలు తినకుడదు. ఈ కార్బై›డ్‌ మామిడి పండ్లు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు తినడం వలన వారికి అనేక అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తోంది.  గడ్డిలో మాగపెట్టినా, ఇథిలీన్‌ గ్యాస్‌తో మాగపెట్టినా సహజ సిద్ధమైన  మామిడి పండ్లు అకుపచ్చ, పసుపుపచ్చ రంగులు కలగలసి ఉన్నట్లు ఉంటాయి. ఈ పండ్లల్లో రసం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యకరం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)