amp pages | Sakshi

కేంద్ర నిధులు...తెలంగాణకే ముందు!

Published on Thu, 12/26/2019 - 02:20

సాక్షి, హైదరాబాద్‌: సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ),రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్‌ ఎడ్యుకేషన్‌ కింద తెలంగాణకే ముందుగా కేంద్ర నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో ఇచి్చన రూ. 382 కోట్లకు సకాలంలో రాష్ట్ర విద్యాశాఖ యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు (యూసీ) ఇవ్వడంతో ఈసారి మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణకే రెండో విడత నిధులు ఇచి్చంది. రెండో విడత కింద రూ.452.62 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో తమ వాటా నిధులు రూ. 301.75 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.

విద్యాశాఖలో మధ్యాహ్న భోజనం, విద్యాభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల భవన నిర్మాణాలు తదితర కార్యక్రమాలకు (కేంద్ర ప్రాయోజిత పథకాలు) కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వేంచించాల్సిఉంది. గతంలో మొదటి విడత నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసేది. దీంతో విద్యాశాఖ కేంద్రానికి సకాలంలో యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రెండో విడత నిధులు సకాలంలో వచ్చేవి కావు. అయితే ఈసారి రాష్ట్రం తమ మొదటి విడత వాటా నిధులను సకాలంలో విడుదల చేయడంతో కేంద్రం రెండో విడత నిధులను కూడా ఇచి్చంది. దీంతో సమగ్ర శిక్షా అభియాన్, రాష్రీ్టయ మాధ్యమిక శిక్షా అభియాన్, టీచర్‌ ఎడ్యుకేషన్‌ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 834.62 కోట్లు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?