amp pages | Sakshi

ప్రాణాలు కాపాడిన చిన్నారి

Published on Mon, 06/01/2020 - 09:16

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): ప్రమాదం జరిగిన వెంటనే ఆ చిన్నారి ఆత్మస్థైర్యం కోల్పోకుండా సమయ స్ఫూర్తితో వ్యవహరించి రెండు ప్రాణాలు కాపాడింది. వివరాలు.. మోర్తాడ్‌ నుంచి ఆర్మూర్‌కు వెళ్తుండగా శుక్రవారం రాత్రి వేల్పూర్‌ మండలం కుకునూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కారులో మోర్తాడ్‌కు చెందిన శ్రీనివాస్, ఆయన భార్య లావణ్య, కూతురు హర్షిత(11), అతడి స్నేహితుడు కృష్ణతేజ ఉన్నారు. ప్రమాదంలో శ్రీనివాస్‌ అక్కడిక్కడే మరణించారు. కాగా లావణ్య, కృష్ణతేజ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. హర్షితపైకి ఆమె తల్లి లావణ్య ఒదిగిపోయారు. (మోదీ చిన్ననాటి ఫొటోలు, ఆసక్తికర విషయాలతో..)

ఎంత పిలిచినా కారులో ఎవరు పలుకకపోవడంతో హర్షిత కారు అద్దం పగులగొట్టి బయట వెళ్తున్న వారిని సాయం కోసం అడిగింది. వాహనాల్లో వెళ్తున్న వారు ఎవరు పట్టించుకోలేదు. చివరకు నడుచుకుంటూ వేరే రాష్ట్రానికి వెళ్తున్న ఓ వ్యక్తి స్పందించి ఆ చిన్నారిని బయటకు తీశాడు. వెంటనే హర్షిత తన తండ్రి ఫోన్‌ నుంచి 108కు, తన తండ్రి స్నేహితుడు దామోదర్‌కి ఫోన్‌ చేసింది. దీంతో అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి లావణ్య, కృష్ణతేజకు ప్రథమ చికిత్స చేసి, ఆస్పత్రికి తరలించారు. ఇదే వాహనంలో హర్షిత కూడా వెళ్లింది. అంతకు ముందే దామోదర్‌కు సంఘటన గురించి హర్షిత వివరించడంతో వారు మోర్తాడ్‌ నుంచి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం లావణ్య, కృష్ణతేజ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. (ప్ర‌ముఖ‌ సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌)

గొడ్డలితో నరికి చంపిన దుండగులు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)