amp pages | Sakshi

సీఐడీ విచారణ పూర్తి

Published on Tue, 08/19/2014 - 03:14

  •     కౌంసల్యాదేవిపల్లిలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల పరిశీలన
  •      మంజూరైన గృహాల్లో 85శాతం అవినీతి
  •      సీఐడీ డీఎస్పీ  సంజీవ్‌కుమార్ వెల్లడి
  • నర్సింహులపేట : మండలంలోని కౌంసల్యాదేవిపల్లి గ్రామంలో ‘ఇందిరమ్మ’ పథకం అక్రమాలపై సీఐడీ చేపట్టిన విచారణ సోమవారం ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌంసల్యాదేవిపల్లిలో ఇందిరమ్మ పథకం మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలపై సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, హెచ్‌సీలు 10 బృందాలుగా వెళ్లి విచారణ చేపట్టారు.

    గ్రామంలో 433 ఇళ్లు మంజూరుకాగా మొదటి రోజు 172, రెండవ రోజు 261 ఇళ్లను తనిఖీ చేశారు. ఈగ్రామంతో పాటు రూప్లాతండాలో మంజూరైన ఇళ్లను సైతం పరిశీలించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పోజిషన్, ఎంత బిల్లు వచ్చింది, ఎంత సిమెంట్ వచ్చింది, రేషన్‌కార్డు, బ్యాంక్ పాసుబుక్కు, లబ్ధిదారు అర్హుడా, అనర్హుడా, బిల్లు ఇప్పించిన వారి వివరాలను నమోదు చేసుకున్నారు. రికార్డుల్లో బిల్లు మొత్తం ముట్టినట్లు ఉన్న లబ్ధిదారులు మాత్రం మొత్తం డబ్బు తమకు ముట్టలేదని అధికారులకు విన్నవించారు.
     
    85శాతం అవినీతి

     
    ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ అన్నారు. విచారణ పూర్తికాగానే సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. గ్రామానికి మంజూరైన ఇళ్లలో 85 శాతానికి పైగా అవినీతి జరిగిందని పరిశీలనలో తేలినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ పూర్తి కాగానే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువగా పాత ఇళ్లపైన, ఒకే పేరు మీద రెండు సార్లు, ఇళ్లు కట్టకుండానే, ఊళ్లో లేని వారి పేర్ల మీద, ఇళ్లు పూర్తి చేయకుండానే డబ్బులు తీసుకున్నవి ఉన్నాయని వివరించారు.

    ఇళ్లు, మనుషులు లేకుండా 30 వరకు బిల్లులు తీసుకున్నారని తెలిపారు. డబ్బులతో పాటుగా సిమెంటులోనూ ఎక్కువగా అక్రమాలు జరిగాయని చెప్పారు. మండలంలో పెద్దనాగారంతో పాటుగా భూపాలపల్లి మండలంలోని రెండు గ్రామాలలోనూ తనిఖీలు చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు వివరించా రు. తనిఖీల్లో సీఐలు కరుణాసాగర్‌రెడ్డి, విజయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, సిబ్బంది చల్లా యాదవరెడ్డి, జబ్బార్, సూర్యప్రకాశ్, హౌసింగ్ డీఈ రవీందర్, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)