amp pages | Sakshi

ప్రతి జిల్లాలోనూ కమాండ్‌ కంట్రోల్‌

Published on Tue, 02/27/2018 - 01:00

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ సరుకులను తరలించే లారీలకు జీపీఎస్, వాటి కదలికలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించడానికి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, ఈ–పాస్‌ విధానం ద్వారా సరుకుల పంపిణీ... ఇలా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెంవేస్తున్న పౌరసరఫరాల శాఖ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. గత ఏడాది హైదరాబాద్‌ పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అత్యుత్తమ ఫలితాలనిస్తుండటంతో క్షేత్రస్థాయిలోనూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. 31 జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభించింది.

ఇందులో భాగంగా ఈనెల 28న సిద్దిపేటలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. అలాగే వచ్చే నెలలో నిజామాబాద్, వనపర్తి, గద్వాల్, కరీంనగర్, మరికొన్ని జిల్లాల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. పౌరసరఫరాల వ్యవస్థకు కీలకమైన మండల స్థాయి నిల్వ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థకు చెందిన 171 గోదాముల్లో 1700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. లోడింగ్, అన్‌లోడింగ్, గోదాం ప్రధాన ద్వారం, వేబ్రిడ్జి, ప్లాట్‌ఫాం, గోదాములో ప్రతి వ్యక్తి కదలికలను గుర్తించేలా ఒక్కో గోదాం వద్ద 5 నుండి 10 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాముల పరిధిలో ఏం జరుగుతున్నదీ, రేషన్‌ సరుకులు తరలించే వాహనాల కదలికలను ప్రత్యక్షంగా వీడియో వాల్‌పై వీక్షించడానికి వీలుగా ఈ కెమెరాలను ఆయా జిల్లాల్లోని పౌరసరఫరాల కార్యాలయాలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. 31 జిలాల్లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలోని సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. దీనివల్ల రేషన్‌ సరుకులు తరలించే వాహనాల కదలికలతో పాటు గోదాముల్లో బియ్యం తరలింపును పర్యవేక్షించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)