amp pages | Sakshi

ఆధార్‌పై రైతుల్లో ఆందోళన

Published on Fri, 08/29/2014 - 02:56

డిచ్‌పల్లి : టీఆర్‌ఎస్ సర్కార్ ప్రకటించిన పంట రుణమా ఫీ పథకం అమలుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. రు ణమాఫీ పథకం వర్తింప జేయడంలో ఆధార్ నెంబరు తప్పనిసరి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయి తే ఈ విషయంలో కొందరు అధికారులు ఒకరకంగా, మరికొందరు అధికారులు మరోరకంగా చెబుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఆ ధార్ అనుసంధానంతో తమకు లాభం జరుగుతుం దా, లేక నష్టం జరుగుతుందా అనే విషయమై రైతులు మదనపడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం   గందరగోళంగా మారింది.

 బ్యాంకుల్లో రైతుల బారులు..
 పంట రుణాలు పొందిన రైతు కుటుంబంలో *లక్ష వర కు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ కోసం  రైతులు తప్పనిసరిగా ఆధార్ జిరా క్స్ పత్రాలను బ్యాంకులు, సహకార సంఘాల్లో అందజేయాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు బ్యాంకులు, సింగిల్ విండోల వద్దకు బారులు తీరుతున్నారు. అయితే కొందరు రైతులు తమకు తాత, తం డ్రుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూముల్లో పంటలు సాగుచేస్తున్నారు. రుణాలు సైతం వారి పేర్లమీదే పొందారు. ఇప్పుడు రుణం పొందిన వారి ఆధా ర్ కార్డు సమర్పించాలని అధికారులు అడగటంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

 గడువుపై స్పష్టత లేదు..
 ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ అర్హత పొందేందుకు రైతులు బ్యాంకు పాసు పుస్తకం, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ పత్రాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇవ్వాలని బ్యాంకర్లు కోరుతున్నా రు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయాధికారులు సైతం రైతులకు సమాచారం అందజేస్తున్నారు. అయితే అధా ర్ కార్డు జిరాక్స్‌లను ఎప్పటిలోగా అందజేయాలనే దానిపై గడువు స్పష్టంగా చెప్పడం లేదు.

 కానీ మండల స్థాయి అధికారులు తమ మండలాల్లో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి, ఈనెల 30లోగా రుణమాఫీ అర్హత గల రైతుల జాబితాను అందజేయాలని సూచి స్తున్నారు. బ్యాంక ర్లు ఇచ్చిన జాబితాను కలెక్టర్‌కు అందజేస్తామని మండల అధికారులు తెలుపుతున్నా రు. ఈనెల 28, 29 తేదిల్లో గ్రామసభలు నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆధార్  పొందని రైతులు నమోదు కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు.నెలాఖరులోగా ఆధార్‌కార్డు సహా అన్ని పత్రాలు అందించకుంటే రుణమాఫీ వర్తించదేమోనన్న ఆందోళన వారిలో ఉంది. అధార్ కార్డులో పేరు తప్పుగా వచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

 గ్రామసభల్లో నిర్ధారిస్తాం..
 రుణమాఫీకి ఆధార్‌కార్డు ఇవ్వని వారిని పరిగణలోకి తీ సుకుంటారని బ్యాంకర్లు చెబుతున్నారు.  రైతులను ఆధార్ జిరాక్స్‌లు తప్పనిసరిగా కావాలని అడగటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీకి అర్హత గల రైతుల పేర్లను రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సరిపోల్చుకుని గ్రామసభల్లో నిర్ధారిస్తామని బ్యాంకర్లు అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా రైతుల్లో ఆందోళన తొలగడం లేదు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)