amp pages | Sakshi

క్షమాపణలు చెప్పిన 'ఇఫ్లూ'

Published on Sun, 03/29/2015 - 08:41

హైదరాబాద్ : హైదరాబాద్లోని 'ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ' (ఇఫ్లూ)లో శనివారం వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణలో గందరగోళం చోటుచేసుకుంది. జరిగిన పొరపాట్లకు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే... విదేశీ భాషలతోపాటు, వివిధ డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇఫ్లూ శనివారం పరీక్షలు నిర్వహించింది. అయితే పరీక్ష సమయాన్ని హాల్‌టిక్కెట్లలో తప్పుగా ముద్రించడంతోపాటు, ఎంఈడీ కోర్స్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రవేశ పరీక్ష రోజున ప్రకటించడం విద్యార్థుల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు 'కంపారిటివ్ లింగ్విస్టిక్స్ అండ్ ఇండియా స్టడీస్' పీజీ కోర్సు ప్రవేశ పరీక్ష జరుగుతుండగా... గంట తర్వాత వచ్చిన అధికారులు తప్పు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చామని, కనుక పరీక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ పరీక్షను తిరిగి సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన అధికారులు విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే రోజు పరీక్ష నిర్వహించటం, దేశ వ్యాప్తంగా ఉన్న 16 పరీక్షా కేంద్రాలను ఎనిమిదికి కుదించడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పైగా శ్రీరామనవమి రోజున పరీక్షలు  నిర్వహించిన తీరును కూడా తప్పుబట్టారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)