amp pages | Sakshi

'ఆ మంత్రికి నీతి, జాతి లేదు'

Published on Wed, 07/26/2017 - 19:13

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు నీతి, జాతి లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి దాసోజు శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నేతలు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో.. ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు. హిమాన్షు మోటార్ పై కేటీఆర్ చెప్పినవి పచ్చి అబద్దాలు అని చెప్పారు.

తనకు సంబంధం లేదన్న కేటీఆర్.. మొన్న ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో చూపింది నిజం కాదా అని ఈ సందర్భంగా శ్రావణ్ ప్రశ్నించారు. టెండర్లు లేకుండా వెంకయ్య నాయుడు కుమారుడికి చెందిన టొయోటా కంపెనీకి ఇన్నోవాలను కొన్నది నిజం కాదా సూటిగా అడిగారు. ఐటీ అవకతవకలకు పాల్పడుతున్న స్వర్ణ భారతి ట్రస్టుకు ఎందుకు రాయితీలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయతీ ఉంటే స్వర్ణ భారతి, హిమాన్షు, సాండ్ మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేనిపక్షంలో గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలంటూ కేటీఆర్ కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ సవాల్‌ విసిరారు.

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)