amp pages | Sakshi

ఆ ‘కలం’.. చిరకాలం!

Published on Thu, 02/21/2019 - 09:50

సాక్షి, సిటీబ్యూరో: ‘దక్కన్‌ పెన్‌’.. దశాబ్దాలుగా ఆదరణ పొందుతూనే ఉంది. నిజాం హయాంలో ప్రారంభమైన ఈ పెన్నుల దుకాణం ఇప్పటికీ విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ రోజుల్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏడో నిజాం ఏర్పాటు చేశారు. దీనికి తగ్గట్టుగానే ఉన్నత విద్యా బోధన జరిగేది. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు వారు రాసేందుకు పెన్నుల డిమాండ్‌ కూడా చాలా పెరిగింది. అప్పటి వరకు సాధారణంగా స్థానికంగా వినియోగించే సిరా పెన్నులే వాడేవారు. అప్పట్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు ఇంగ్లండ్, జర్మన్‌తో పాటు ఫ్రాన్స్‌ దేశాల్లో తయారు చేసే పెన్నులపై ఎక్కువగా మొగ్గు చూపేవారు. వీరి అభిరుచికి అనుగుణంగానే ‘దక్కన్‌ పెన్‌ స్టోర్స్‌’ నిర్వాహకులు అరుదైన కలాలను అందుబాటులో ఉంచేవారు. ఇప్పటికీ ఈ దుకాణం మనుగడలోనే ఉండటం గమనార్హం. 

నిజాం కాలంలోనే..
‘నిజాం కాలంలోనే నగరంలో పెన్నుల దుకాణం మొదలైంది. బాల్‌పాయింట్‌ పెన్‌ లేని సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ‘దక్కన్‌ పెన్‌ స్టోర్‌’ మొదలైంది. ఆ సమయంలో ధనవంతులు పౌంటెన్‌ పెన్‌ కొనాలంటే కోల్‌కతా, ముంబై వెళ్లాల్సిందే. నగరంలో ఆ పెన్నులను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎస్‌.ఎ.సిద్ధిఖీ నగరంలో ఈ పెన్నుల దుకాణం ప్రారంభించారు’ అని సిద్ధిఖీ వారసుడు ప్రస్తుత దక్కన్‌ స్టోర్‌ యజమాని హలీం చెప్పారు.

అత్యాధునిక కలాలు..
దేశంలోనే అత్యాధునిక రకాల కలాలను దక్కన్‌ పెన్‌ స్టోర్‌లో చూడవచ్చు. ప్రాచీన కాలం నాటి పెన్నుల నుంచి అరుదైన రకాలూ కొలువయ్యాయి ఇక్కడ. బాల్‌పెన్, రోలర్, ఫౌంటెన్, జెల్, డిస్పోజబుల్‌ పెన్‌ అంటూ చాలా రకాల వైవిధ్యతలతో కూడినవి ఇక్కడ ఉన్నాయి. వాటర్‌ మ్యాన్‌ పెన్, పార్కర్, షెఫర్, క్రాస్, పెలికన్‌ తదితర రకాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే.

వైవిధ్యమైనవెన్నో...
వాడి పారేసే మూడు రూపాయల పెన్నుల నుంచి రూ.లక్ష.. ఆ పైచిలుకు ధర ఉన్న పెన్నులు ఇక్కడ ఉన్నాయి. రూపాయలు, వందలు, వేల రూపాయల ఖరీదైన వాటిని ఇక్కడ సందర్శనకు పెట్టారు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాలను గమనించవచ్చు. ఐరోపా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందినవి చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా నటీనటులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు.. దుకాణాన్ని సందర్శించి పెన్నులను కొనుగోలు చేస్తారు. నిజాం వారసుడు మఫకంజా.. హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ పెన్‌స్టోర్‌ను దర్శిస్తారని దీని నిర్వాహకుడు హలీం చెప్పారు.

దేశంలోనే ఖరీదైనవి..   
ఇక్కడ ఉన్న కొన్ని పెన్నులు రూ.లక్షపైనే ధరల్లో ఉన్నాయి. వాటి వాటి ప్రత్యేకతల ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కాన్వే స్టెవార్ట్‌ పెన్‌ దక్కన్‌ పెన్‌స్టోర్‌లో అత్యధికంగా రూ.1,39,750 ధర పలుకుతోంది. పూర్తిగా వెండితో తయారు చేయడమే ఇందుకు కారణం. పెన్ను ముందు భాగంలో బంగారంతో తయారు చేసిన టిప్‌ ప్రత్యేక ఆకర్షణ. సాధారణ పెన్నులతో పోలిస్తే దీని బరువు ఎక్కువ. దేశంలో ఎక్కడా లభించని పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు దేశంలో అత్యధిక ధర ఉన్న పెన్నులు కూడా హైదరాబాద్‌లోని ఈ షాప్‌లోనే ఉన్నాయి. 

దేశ విదేశాల పెన్నులకు రిపేరింగ్‌  
కొనుగోలు చేసిన వేల రూపాయల విలువైన పెన్నులు పాడైతే వాటిని వృథాగా పడేయకుండా ఈ దుకాణంలో బాగు చేస్తారు. కొనుగోలుదారులకు పెన్నుల గురించి సందేహాలను నివృత్తి చేస్తారు.  దేశ విదేశాల్లో తయారైన హ్యాండ్‌మేడ్‌ పెన్నులను దక్కన్‌ పెన్‌ షాప్‌లో రిపేరింగ్‌ కూడా చేస్తారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లతో పాటు మిడిల్‌ ఈస్ట్‌ నుంచి కూడా పెన్నులు రిపేరింగ్‌కు వస్తాయని నిర్వాహకులు తెలిపారు.

తొలినాళ్ల నుంచే విదేశీ బ్రాండ్‌లు..  
విశ్వవిద్యాయలం ఏర్పాటైన మూడేళ్లకే అలహాబాద్‌ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌ నగర్‌)లో నివసించే సబీ అక్తర్‌ సిద్ధీఖీ ఇంగ్లండ్‌లో తయారయ్యే కన్‌వెస్టివర్డ్‌ పెన్, ఫ్రాన్స్‌లో తయారు అయ్యే డ్యూరో పెన్‌ కంపెనీల ఏజెన్సీలను తీసుకొని 1922లో నగరానికి వచ్చారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతో పాటు విద్యార్థులను కలిసి పెన్నుల విశిష్టతను తెలిపి విక్రయించే వారు. ఇలా ఆరేళ్ల పాటు పెన్నులు విక్రయించి 1928లో అబిడ్స్‌లో ‘ది దక్కన్‌ పెన్‌ స్టోర్‌’ను ప్రారంభించారు. 90 ఏళ్లుగా దేశ విదేశాల్లో తయారయ్యే పెన్నులు ఇప్పటికీ విక్రయిస్తూనే ఉన్నారు.  

మూడు తరాలుగా కొనసాగిస్తున్నాం.. 
ఏడో నిజాం కాలంలో మా నాన్న ఎస్‌.ఎ.సిద్ధిఖీ ఫ్రెంచ్‌ పెన్నును నగరానికి పరిచయం చేశారు. డ్యూరో పెన్‌ ఏజెన్సీని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఆ సమయంలో ఇంటింటికీ వెళ్లి పెన్నుల గురించి ప్రచారం చేస్తూ అమ్మకాలు సాగించేవారు. అరుదైన రకాల పెన్నులేవైనా పాడైతే.. మా దగ్గరకు తెస్తే  అబిడ్స్‌ శాఖలో రిపేరింగ్‌ చేస్తాం. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ వాటర్‌మ్యాన్‌ పెన్నును తీసుకొచ్చి రిపేరింగ్‌ చేయాల్సిందిగా కోరారు. క్వీన్‌ ఎలిజబెత్‌ నుంచి ఆ పెన్ను బహుమతిగా పొందినట్లు చెప్పారు. మా దగ్గరున్న యంత్రం సహాయంతో విడిభాగాలు తయారు చేసి, ఆ తర్వాత రిపేరింగ్‌  చేసి ఇచ్చాం.               – హలీం అక్తర్‌ సిద్ధిఖీ,                  దక్కన్‌ పెన్‌స్టోర్‌ యజమాని  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)