amp pages | Sakshi

'అన్ని వర్గాల సంక్షేమం కోసం తపిస్తున్న కేసీఆర్'

Published on Tue, 04/28/2015 - 00:30

హైదరాబాద్: తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడి సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదినెలల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచించారన్నారు. వృద్ధులు, వితంతుల కోసం నెలనెలా వెయ్యి రూపాయల పింఛన్ల పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. అలాగే వికలాంగులకు రూ. 1500 ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. పేద ముస్లింల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 51వేలు ఇస్తున్న ప్రభుత్వం ఇదొక్కటేనని అన్నారు.


రాజస్థాన్‌లో అక్కడి ముఖ్యమంత్రి షాదీ ముబారక్ గురించి వాకబు చేయడాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటుబ్యాంకు గానే ఉపయోగించుకుందని విమర్శించారు. పేదలకు ఇచ్చే ఒకరూపాయికి కిలో బియ్యం పథకాన్ని కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందేలా చేశారన్నారు. రాష్ట్రంలో ఓ ఎస్‌సీ, ముస్లిం మైనారిటీ వ్యక్తులను ఉప ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత కూడా కేసీఆర్‌దేనని అన్నారు. సెక్యులరిజానికి కట్టుబడ్డ సీఎం అని కొనియాడారు. టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె. కేశవరావు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణ కోల్పోయినదేంటో, సాధించుకున్నదేంటో కేసీఆర్ తన పాలన ద్వారా చూపిస్తున్నారన్నారు. సమైక్య పాలనలో సాగర్ కింద రెండో పంటకు నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని , ఈసారి 3.5 లక్షల ఎకరాలకు రబీలో నీరందిస్తున్నట్లు చెప్పారు.


మన హక్కును మనం సాధించుకోవడానికే కేసీఆర్ 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని కితాబిచ్చారు. 64 ఏళ్ల సమైక్య పాలనలో వేసవి కాలంలో కరెంటు కట్‌లేని పరిస్థితి ఏనాడూ లేదని, ఈసారి ఆ పరిస్థితి లేకుండా కరెంటు అందిస్తున్నట్లు చెప్పారు. రూ. 91,500 కోట్లతో 24వేల మెగావాట్ల విద్యుత్తును నాలుగేళ్లలో ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు కేకే వివరించారు. పోరాడి తెలంగాణను సాధించుకోవడంతోనే సరిపోదు.. సాధించుకున్న తెలంగాణను పునర్మించుకోవాలన్న పట్టుదల కేసీఆర్‌లో ఉందన్నారు.


వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను నీళ్లతో నింపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చరిత్ర సృష్టించిందన్నారు. 14 ఏళ్ల పోరాటంలో వ్యూహాత్మకంగా కేసీఆర్ తెలంగాణను సాధించారని కొనియాడారు. కాంతులీనే బంగారు తెలంగాణను పునర్నిర్మించుకునే యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ సంక్షేమ సారథి’ ఆడియో సీడీని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)