amp pages | Sakshi

అడవికి నిప్పు

Published on Thu, 05/21/2015 - 02:42

కలప, తునికాకు కోసం స్మగ్లర్ల ఆగడాలు
వన్యప్రాణులకూ తప్పని ముప్పు
పట్టించుకోని అటవీ శాఖ అధికారులు
ఉన్నతాధికారుల పర్యవేక్షణా కరువే

డిచ్‌పల్లి :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచాలని ప్రతిష్టాత్మకంగా ‘హరితహారం’ పథకం ప్రవేశపెట్టారు.

ప్రతి నియోజకవర్గం లో 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించి, ఆ మేరకు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. అయితే, అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలప స్మగ ్లర్మతో కుమ్మక్కై విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  క లప, తునికాకు కోసం కొందరు స్మగ్లర్లు ఎంతకైనా బరి తెగిస్తున్నారు. తమ స్వార్థం కోసం అడవులకు నిప్పు పెట్టడంతో లక్షలాది రూపాయలు విలువ చేసే చెట్లు కాలి బూడిదవుతున్నాయి.

అటవీ సంపదను కాపాడాల్సిన అటవీ అధికారుల నిర్లక్ష్యంతోనే స్మగ్లర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి యేటా అడవుల సంరక్షణ కోసం కోట్లాది రూపాలయలు కేటాయిస్తుంది. అడవులను రక్షించుకోవాలని, ఇది అందరి భాద్యత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలను అటవీ అధికారులు ఆచరణలో ఏమాత్రం అమలు చేయడం లేదు. దీంతో అడవులు యథేచ్ఛగా త గులబడిపోయి విలువైన చెట్లు అంతరిస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
కళ్ల ముందే తగులబడుతున్నా

డిచ్‌పల్లి మండలంలో ఇందల్వాయి రేంజ్ పరిధిలో అడ వులు ఉన్నాయి. 44వ నంబరు జాతీయరహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఈ ఆడవులకు స్మగ్లర్లు నిప్పు పెట్టడంతో వందలాది చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. జాతీయరహదారికి సమీపంలోనే అడవులకు నిప్పు పెడుతున్నా అటవీ అధికారులు చర్యలు తీసుకోవడం లే దని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందల్వాయి స్టేషను, గన్నారం, చంద్రాయన్‌పల్లి పరిధిలోని అటవీ ప్రాంతాలలో ఎక్కువగా కలప, తునికాకు కోసం అడవులకు నిప్పు పెడుతున్నారు.

దీంతో లక్షలాది రూపాయల విలువ చేసే టేకు, ఇప్ప, సెనంగీ, పాలకొడిసే, నల్లమద్ది, సిరుమాని, వేప తదితర  చెట్లతో పాటు అడవిలో ఉండే వివిధ రకాల పండ్ల చెట్లు కాలిపోతున్నాయి. పట్టపగలే అడవులకు నిప్పు పెడుతున్నా, కళ్లముందే అడవులు కాలిపోతున్నా,  సంబందిత అటవీ అధికారులు ప్రేక్షక పాత్ర వహి స్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
 
వన్యప్రాణులకు ముప్పు
తునికాకు, కలప కోసం అడవులకు నిప్పు పెట్టడంతో అందులో నివసించే వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడుతోందని మండలవాసులు పేర్కొంటున్నారు. వేసవి తా పం నుంచి సేద దీరేందుకు చెట్లు లేకపోవడంతో, గత్యంతరం లేక వన్యప్రాణులు జనావాసాలకు వస్తున్నాయి. కొన్ని ప్రాణులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బలవుతున్నాయి.ఇప్పటికైనా అడవులకు నిప్పు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని అడవులను రక్షించాలని పలువురు కోరుతు న్నారు.
 
అధికారుల పర్యవేక్షణ కరువు
అడవులను కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి ఉన్నప్పటికీ అడవులకు నిప్పు పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అడవు ల సంరక్షణపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, రాత్రి వేళల్లో గ స్తీ దళాలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ దు స్థితి నెలకొందని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

అటవీ ప్రాంతంలోని వాగులు, కుంటల్లో నుంచి ఇసుక, మొరం అక్రమ రవాణా చేసే వారిని పట్టుకోవడం, అందిన కాడికి దండుకుని వదిలేయడం, లేదంటే వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం చేస్తున్నారు. ఇసుక, మొరం రవాణా చేస్తున్న వారిపై  ఉన్న శ్రద్ధ కలప రవాణా చేసే వారిపై ఉండటం లేదనే సంబంధిత శాఖలోని కింది స్థాయి సిబ్బంది విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి  విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌