amp pages | Sakshi

దివ్యాంగ విద్యార్థికి ఇక్కట్లు

Published on Thu, 02/28/2019 - 02:55

అల్లాదుర్గం (మెదక్‌): దివ్యాంగుడైన ఓ ఇంటర్‌ విద్యార్థి వార్షిక పరీక్షల్లో నష్టపోవల్సిన పరిస్థితి నెలకొంది. తండ్రి నిరక్ష్యరాస్యుడు, ఆ విద్యార్థికి కాళ్లు, చేతులు సరిగా పని చేయవు. సహాయకుడితో పరీక్షలు రాసే అనుమతి ఇవ్వాలని వేడుకున్నా.. అనుమతి లేదంటూ అధికారులు అతనితోనే పరీక్ష రాయించారు. బుధవారం మెదక్‌ జిల్లా అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. అల్లాదుర్గం మండలం వెంకట్‌రావ్‌పేట గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌ స్థానిక జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బాల్‌రాజ్‌ చేతులు, కాళ్లు సరిగా పని చేయని దివ్యాంగుడు. బుధవారం ప్రారంభమైన తెలుగు పరీక్షను సహాయకుడితో రాస్తానని బాల్‌రాజ్‌ కళాశాల పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ను అడిగినా.. బోర్డు అనుమతి లేదని కళాశాల అధికారులు నిరాకరించారు.  

రెగ్యులర్‌ విద్యార్థినే.. 
కాలేజీలో రెగ్యులర్‌గానే చదివానని, తాను దివ్యాంగు డినని అందరికీ తెలుసని, సహాయకుడికోసం అధికారులు బోర్డు అనుమతి కోసం ఎందుకు పంపలేదో తెలియదని బాల్‌రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పరీక్ష రాస్తే సమయం సరిపోదని బాల్‌రాజ్‌ వాపోయాడు. తామే బోర్డు నుంచి అనుమతి తెచ్చుకోవాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. పదో తరగతిలో కూడా సహాయకుడితోనే పరీక్షలు రాసినట్లు వివరించాడు. ఈ విషయంపై పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ రవీందర్‌ను వివరణ కోరగా, బోర్డు నుంచి విద్యార్థి అనుమతి తెచ్చుకోలేదని చెప్పారు. తమకు అతను సర్టిఫికెట్లు ఇవ్వలేదని, విద్యార్థే సహాయకుడికోసం అనుమతి తెచ్చుకోవాలని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన సమయంలో అడిగితే తామేం చేస్తామన్నారు. ఇప్పటికైనా బోర్డుకు వెళితే అనుమతి వస్తుందని తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)