amp pages | Sakshi

డీజేపై నిషేధం విధించండి

Published on Tue, 06/27/2017 - 01:45

అభ్యంతర పదాలున్నాయంటూ హైకోర్టులో పిల్‌
సాక్షి, హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలోని నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వాటిని తొలగించే వరకు సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించాలని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్‌ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపనుంది.

డీజే సినిమాలోని శృంగార గీతాల్లో అభ్యంతరకర పదాలున్నాయని..వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెన్సార్‌ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా పరిగణనలోకి తీసుకోలేదని, మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్‌ తెలిపారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించే వరకు డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కృష్ణమోహన్‌ కోరారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)