amp pages | Sakshi

బతుకమ్మచీరకు దూరం

Published on Fri, 10/05/2018 - 09:05

సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం  ఆదేశాలు జారీ చేయడంతో గ్రేటర్‌ పరిధిలోని దాదాపు 25 లక్షల మంది మహిళలు ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు  బతుకమ్మ  చీరలకు దూరం కానున్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో ఏదో విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశించిన  గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ నేతలకు నిరాశే మిగిలింది.  బతుకమ్మ చీరల పంపిణీపై పలు సంశయాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలు తదితర పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భంగం వాటిల్లకుండా చీరల ప్యాకెట్లలో ముఖ్యమంత్రి, హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ మంత్రి ఫొటోలతో కూడిన లేబుళ్లను తొలగించి చీరలు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వర్తమానం పంపించింది. సీఎం, మంత్రి ఫొటోలు తీసేస్తే  ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలుండక పోవచ్చునని అంచనా వేసి ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

   దాంతోపాటు  చీరల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులెవరూ జోక్యం చేసుకోరాదని,  ప్రభుత్వోద్యోగుల ద్వారా మాత్రమే వీటి పంపిణీ చేయాలని సూచించింది.  ఈనెల పదో తేదీలోగా చీరలన్నీ సంబంధిత గోడౌన్లకు చేరడంతోపాటు 12వ తేదీ నుంచి 17వ తేదీలోగా చీరల పంపిణీ పూర్తిచేయాలని పేర్కొంది.  అందుకనుగుణంగా   గ్రేటర్‌లోని  జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, పట్టణ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పంపిణీకి సంబంధించి తగిన ఏర్పాట్లకు సిద్ధమవుతుండగానే, బతుకమ్మ చీరల పంపిణీ  నిలిపివేయాలని   కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వెలువడటంతో ఈ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది.   తెల్లరేషన్‌ కార్డుల్లో పేర్లున్న 18 సంవత్సరాల వయసు పైబడిన   పేద మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ పేరిట ఉచిత చీరల పంపిణీని గత సంవత్సరం నుంచి చేపట్టడం తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో చీరలు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వ ప్రయత్నం   ఎన్నికల సంఘం ఆదేశాలతో బెడిసి కొట్టింది.  

25 లక్షల మందికి దూరమైన లబ్ధి..
పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న వివరాల మేరకు, 18 సంవత్సరాల వయసునిండిన, తెల్లకార్డుల్లో  పేర్లున్న మహిళలు గ్రేటర్‌ పరిధిలో 25.20 లక్షల మంది ఉంటారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)