amp pages | Sakshi

దయగల వాడే మా " దయన్నా"

Published on Mon, 11/19/2018 - 11:03

సాక్షి,  పాలకుర్తి: తన ఇంటికి సమస్యలతో సహాయం కోసం వచ్చిన వారికి చేయలేనని చేప్పకుండా సహాయం చేసే మహానాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఆందుకే అక్కడి ప్రజలందరూ ఆయనను దయగల వాడే మా " దయన్నా" అంటారు.  పాలకుర్తి నియోజకవర్గం సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, దశాబ్దాలుగా బీళ్లు మారిన భూములకు సాగునీరందించి సస్యశ్యామలం చేస్తానని టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడిగా పేరున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ సారి 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తానని ధీమాతో  ఉన్నారు. సోమవారం ఆయన నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్నబహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘సాక్షి’   ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. 

సాక్షి: నామినేషన్‌ కార్యక్రమానికి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ రావడం ఎలా ఫీలవుతున్నారు ?
దయాకర్‌రావు: సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేసుకున్న తర్వాత రాష్ట్రంలో కేవలం పాలకుర్తిలో నా నామినేషన్‌ కార్యక్రమానికి మాత్రమే హాజరు కావడం ఆనందంగా ఉంది. 
సాక్షి: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ నుంచి ఎలాంటి వరాలు కోరబోతున్నారు..? 
దయాకర్‌రావు: గతంలో సీఎం కేసీఆర్‌ పాలకుర్తికి వచ్చిన సందర్భంగా పాలకుర్తి, వల్మిడి, బమ్మెర పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.22 కోట్లు, పాలకుర్తిని సిద్ధిపేట, ఖమ్మం తరహాలో తీర్చిదిద్దడానికి రూ. 25 కోట్లు నిధులు మంజూరు చేశారు. టెండర్లు పూర్తయ్యాయి. పనులు పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథలో తాగునీరు, 4,500 డబుల్‌ బెడ్‌ రూంల నిర్మాణాలు, దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ద్వారా సాగు నీరందించేందుకు నిధులు, ఇతర అభివృద్ధి పనులకు సుమారు రూ. 700 కోట్ల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేశారు. మండల కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కోర్సు కళాశాలలు మంజూరు చేయాలని కోరుతా. 
సాక్షి: సీఎం బహిరంగ సభ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.  
దయాకర్‌రావు: సీఎం కేసీఆర్‌ సభకు రావాలని కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే ఊహించని విధంగా స్పందన వస్తుంది. గ్రామానికి సగటున 500 మందిని తరలించాలని కోరితే  1000 మందిని తీసుకొస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంచనాకు మించి ప్రజలు సభకు తరలివస్తారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించే నియోజకవర్గాల్లో పాలకుర్తి ఉండబోతుంది.
సాక్షి: మళ్లీ గెలిస్తే చేయబోయే పనులేమిటి ? 
దయాకర్‌రావు: నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు 80 శాతం మంది ప్రజలకు ఉపాధి కల్పించే వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి గ్రామంలోని బీడు భూములకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తా. వ్యవసాయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. తనకు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటా.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)