amp pages | Sakshi

'సిని'వారం

Published on Sat, 11/25/2017 - 12:34

ప్రతి శనివారంషార్ట్‌ఫిల్మ్‌ల ప్రదర్శన సైన్స్‌ సెంటర్‌లో మినీ థియేటర్‌ కొత్త దర్శకులకు ప్రోత్సాహం వచ్చే నెలలో ప్రారంభం రవీంద్రభారతి తరహాలో వరంగల్‌లో వేదిక   

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: షార్ట్‌ఫిల్మ్‌ మేకింగ్, సినీరంగంపై ఆసక్తి , సృజనాత్మకత ఉన్న వారు తమ ప్రతిభను చాటుకునేందుకు వరంగల్‌లో వేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతమైన సినివారం కార్యక్రమాన్ని వరంగల్‌లో ప్రారంభించనున్నారు. తెలుగు మహసభల ప్రారంభోత్సవ సమయానికల్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

కొత్త టాలెంట్‌ను వెతికేందుకు..
కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ సినివారం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శిస్తున్నారు. 2016 నవంబరు 12న ఈ సినీవారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు వందకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లను ఇక్కడ ప్రదర్శించారు. వీటిని చూసేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. ప్రదర్శన అనంతరం వాటిని రూపొందించిన వ్యక్తుల పరిచయం, షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించిన అంశాలపై వివరణ, కొత్త ఆలోచనలను వీక్షకులతో పంచుకోవచ్చు. కొత్త టాలెంట్‌ను వెతికి పట్టుకునేందుకు సినీరంగానికి చెందిన ప్రముఖులు ఈ షార్ట్‌ఫిల్మ్‌లు చూసేందుకు వస్తున్నారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దీన్ని వరంగల్‌కు తీసుకువచ్చేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ సుముఖంగా ఉన్నారు.

వరంగల్‌లో
హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్‌ గుర్తింపు పొందింది. హైదరాబాద్‌ తరహాలోనే ఇక్కడ సినీవారం కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధికారులు అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. హంటర్‌రోడ్డులోని రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఉన్న మినీ ఆడిటోరియాన్ని ఎంపి క చేశారు. షార్ట్‌ఫిల్మ్‌ ప్రదర్శించేందుకు, తిలకించేం దుకు వీలుగా ఇందులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంబంధి త శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా రు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం నాటికి వరంగల్‌లో సినీవారం కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్‌లో పర్యాటక ప్రాంతాలు, చారిత్రక నేపథ్యం, ఎంజీఎం ఆస్పత్రి ఈ మూడు అంశాలపై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు పెట్టనున్నారు.

చక్కని వేదిక..
కొంత కాలంగా వరంగల్‌ నుంచి అనేక మంది కొత్త తరం దర్శకులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అనేక మంది సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వెలుగులోకి రాకుండా తమ ప్రయత్నాలను కొనసాగించేవారు ఎందరో ఉన్నారు. వీడియో కెమెరాలు, నాణ్యతతో వీడియో తీసే మొబైల్‌ ఫోన్స్‌ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్‌ కారణంగా ఎడిటింగ్, మిక్సింగ్‌ వంటి ఎన్నో సేవలు సులభంగా లభిస్తుండడంతో షార్ట్‌ ఫిల్మ్‌ తీసేవారి సంఖ్య పెరుగుతోంది. వరంగల్‌ కేంద్రంగా దాదాపు 40 బృందాలు రెగ్యులర్‌గా షార్ట్‌ఫిల్మ్‌ తీస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా మలుచుకుని ప్రతిభను చాటుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో షార్ట్‌ఫిల్మ్‌లు ఇందులో అప్‌లోడ్‌ అవుతుండడంతో గుర్తింపు సాధించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో  సినీ, టీవీ రంగాలకు సంబంధించిన ప్రధాన వేదికల్లో ప్రదర్శన చేసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ  ఇబ్బందులను తొలగించేందుకు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న ప్రతిభా వంతులకు సినీవారం కార్యక్రమం చక్కని వేదిక కానుంది.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)