amp pages | Sakshi

రైతు పాదయాత్ర భగ్నం

Published on Wed, 02/27/2019 - 02:34

పెర్కిట్‌/జక్రాన్‌పల్లి: తమ డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన పాదయాత్రను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. ఎర్రజొన్న, పసుపు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా మంగళవారం చలో అసెంబ్లీ పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జక్రాన్‌పల్లి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు. జై జవాన్‌ జై కిసాన్‌ అంటూ నినాదాలు చేశారు. ఐదు కిలో మీటర్ల వరకు సాఫీగా సాగిన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సికింద్రాపూర్‌ వద్ద జాతీయ రహదారికి అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా బలగాలను మోహరించారు.

పాదయాత్రకు అనుమతి లేదని, 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఆందోళన విరమించాలని రైతులకు సూచించారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ నిరసనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లడానికే శాంతియుతంగా పాదయాత్ర చేపట్టామని, తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని రైతులు వేడుకున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను దాటుకుని ముందుకు కదిలారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అరెస్ట్‌ చేసి సమీపంలోని స్టేషన్‌లకు తరలించారు. కేశ్‌పల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పంట పొలాల వైపు పరుగెత్తిన రైతుల వద్దకు కమిషనర్‌ కార్తికేయ వెళ్లి మాట్లాడి సముదాయించి వారిని వెనక్కి పంపించారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)