amp pages | Sakshi

సాగుకు చేయూత..

Published on Mon, 05/27/2019 - 11:50

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : రైతులు పంటలు సాగు చేసేందుకు బ్యాంకులు చేయూతనిస్తున్నాయి. వ్యవసాయం కోసం పంట రుణాల పరిమితిని పెంచుతూ నాబార్డు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతులకు ఇది శుభవార్తే. వేసవిలో దుక్కులు సిద్ధం చేసుకొని, తొలకరి చినుకులు పడగానే వెంటనే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తారు. వీటిని కొనుగోలు చేయడగానికి రుణాలు ఎంతో అవసరం. ప్రతి ఏడు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత్యంతరం లేక అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంట రుణ పరిమితిని పెంచిన నేపథ్యంలో సకాలంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తే వ్యవసాయం సజావుగా సాగుతుంది. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో వ్యవసాయంతోనే జీవనం సాగిస్తున్నారు. గత ఏడు ఖరీఫ్‌లో జిల్లాలో 1,42,704 హెక్టార్ల సాగు కాగా ఈ ఏడు ఖరీఫ్‌లో 146910 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

రైతుల సంక్షేమానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  రైతు బంధు, ప్రధానమంత్రి కిసాన్‌ సన్మాన్‌ తదితర పథకాలు అమలు చేసిన ఏటా ఎరువులు, విత్తనాలు, కూలీల ధరలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి, సరైన సమయంలో ఖరీఫ్‌ యాసంగి రుణాలు మంజూరు చేయకపోవడంతో పెట్టుకోసం వడ్డీ వ్యాపారులు, మార్కెట్‌లోని దళారులను ఆశ్రయించి పంట దిగుబడి వచ్చిన తరువాత ధాన్యాన్ని వారికే విక్రయించి అప్పులు తీరుస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు సిండికేట్‌గా మారగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏటా రైతులు అప్పులే  మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట రుణాల పరిమితి పెంచడంతో రైతులకు కొంత ఊరట లభించినట్లయింది.

ఆదేశాలు జారీ చేశాం
పంట రుణ పరిమితిని ఈ ఏడు ఖరీఫ్‌కు పెంచుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు  నిర్ణయం తీçసుకున్నాం. ఈ ఆదేశాలను ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులకు రుణాలు సకాలం అందించి రైతు అభివృద్ధికి కృషి చేయాలి.    –హరిప్రసాద్, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్