amp pages | Sakshi

హెల్ప్‌డెస్క్‌లు భేష్

Published on Wed, 07/22/2015 - 04:30

తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు
ఇప్పటివరకు 64 మంది చిన్నారులకు రక్షణ

     
 ఇందూరు/మోర్తాడ్ : జిల్లాలోని 11 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 18 పుష్కరఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించడాని కి ప్రజలు పిల్లా పాపలతో వస్తున్నారు. భక్తుల ర ద్దీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల చెం తకు చేర్చడానికి జిల్లా మహిళా, శిశు సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ ఘాట్ వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏ ర్పాటు చేశారు. వారం రోజులుగా పుష్కరాలలో మొ త్తం 64 మంది పిల్లలు తప్పిపోయారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది వీరిని క్షే మంగా వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందజేసి ఘనతను చాటుకున్నారు.

సమస్య తలెత్తకుండా తప్పిపోయిన పిల్లలు కుటుంబసభ్యులకు చెందిన వారో కాదో పూర్వాపరా లు, గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే అప్పగించారు. ఎక్కువగా పోచంపాడ్, కందకుర్తి, తడ్‌పాకల్, తుంగిని ఇంకా ఒకటి రెండు పుష్కరప్రాం తా లలో నిత్యం లక్షల మంది స్నానా లు ఆచరించడానికి వచ్చారు. ఇక్కడ భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం తో చిన్న పిల్లలు చాలా మంది తప్పిపోయారు. ఈ క్రమంలో పుష్కర ప్రాంతాలలో ఉన్న హెల్ప్ డెస్క్ సిబ్బందికి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో తప్పిపోయిన పిల్లలను వెతికి మరీ వారికి అందించా రు.

ఒంటరిగా కనిపించిన పిల్లలను హెల్ప్ డెస్క్‌కు తీసుకువచ్చి పిల్లల వివరాలు కుటుంబ సభ్యులకు తె లిసేలా మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. తద్వారా పిల్లల ఆచూకీ తొందరగా లభించింది. హెల్ప్ డెస్క్‌ల విధుల నిర్వహణను బాధిత తల్లిదండ్రులు కొనియాడారు. అధికారులు కూడా వారిని అభినందించారు. పుష్కర ఘాట్‌ల వద్ద ఒక వేళ హెల్ప్ డె స్క్‌లు లేకుంటే జన ప్రవాహంలో తప్పిపోయిన పిల్ల ల ఆచూకీ అంత సులభంగా లభించేది కాదు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌