amp pages | Sakshi

అగ్గి లేస్తే బుగ్గే

Published on Mon, 02/23/2015 - 00:30

జిల్లాలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అంతంతమాత్రమే...
 
 ఫైర్ స్టేషన్లలో పీడిస్తున్న సిబ్బంది లేమి
మూలకుపడ్డ ఫైరింజన్లు.. నీటి కొరత  కానరాని ప్రత్యామ్నాయ చర్యలు

 
వేసవి కాలం వచ్చేసింది... ఇప్పటికే మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అరుుతే మన జిల్లా యంత్రాంగం ఇంకా మేల్కొన్నట్లు లేదు. ఫైరింజన్ల కొరత... ఫైర్ స్టేషన్లలో సిబ్బంది లేమి పీడిస్తుండగా... నీటి తిప్పలు వెక్కిరిస్తున్నారుు. జిల్లావ్యాప్తంగా ఫైర్ స్టేషన్లు, ఫైరింజన్ల (అగ్నిమాపక యంత్రాలు) దుస్థితి, నీటి తిప్పలపై ‘సాక్షి’ ఫోకస్...
 
 
భూపాలపల్లి : పారిశ్రామిక ప్రాంతమైన  భూ పాలపల్లి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేదు.  పరకాల వాహనమే దిక్కు.

స్టేషన్ ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్‌లో కూడా ఫైర్‌స్టేషన్ లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే జనగామ లేదా హన్మకొండ నుంచి ఫైర్ ఇంజన్ రావాల్సిందే.

వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినా పనులు మొదలుకాలేదు.

పాలకుర్తి : ఈ నియోజకవర్గంలో కూడా ఫైర్ స్టేషన్ లేదు.
 
 నియోజకవర్గాల వారీగా ఫైర్ స్టేషన్ల దుస్థితి
 
డోర్నకల్ : ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. మరిపెడలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి 2 మండలాలకు మాత్రమే సేవలందుతున్నాయి. మిగతా మండలాలకు మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక వాహనం రావా ల్సి వస్తోంది. సకాలంలో చేరకపోవడంతో నష్టం ఎక్కువగా ఉంటోంది.

జనగామ : నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఉండగా.. దీని పరిధిలో 11 మండలాలు వస్తున్నా యి. 16 మంది సిబ్బందికి 11 మందే ఉన్నారు. నీటిని బయట నింపుకోవాల్సి వస్తోంది.

మహబూబాబాద్ : 7 మండలాలకు మానుకోటలోని ఫైరింజనే దిక్కు. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది.

  నర్సంపేట : నర్సంపేటలోని ద్వారకపేటలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఎక్కడైనా ప్రవూదం జరిగితే.. వూర్గవుధ్యలో నీరు నింపుకోవాల్సిన  దుస్థితి.

పరకాల : పరకాలలోని అగ్నిమాపక కేంద్రంలో అన్నీ సమస్యలే. నీటి సమస్య తీవ్రంగా ఉండగా.. 15మందికి గాను పది మంది సిబ్బందే ఉన్నారు. వాహనం కూడా తరచూ మరమ్మతులకు వస్తోంది.

  ములుగు : ములుగు వ్యవసాయశాఖ కార్యాలయంలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఈ నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూరు వరకు ఇక్కడి నుంచే వాహనం వెళ్లాల్సి వస్తోంది.

తూరు, పశ్చిమ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఫైర్ స్టేషన్‌లో 21 మందికి ఆరుగురు, పశ్చిమ సెగ్మెంట్ పరిధిలోని హన్మకొండ బాలసముద్రంలోని స్టేషన్‌లో 10 మందికి ఏడుగురే విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనాల్లో కూడా ఒకటి మూలన పడింది.
 
ఫైర్‌స్టేషన్ లేక కష్టాలు
 
పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గంలో ఐదు మండలాలు 101 రెవెన్యూ గ్రామాలున్నాయి. సగటున ఏటా నియోజకవర్గంలో 10 కి పైగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఫైర్‌స్టేషన్ లేకపోవడంతో వీటి నివారణ సాధ్యం కావడం లేదు. అగ్ని ప్రమాదాలు జరిగితే తొర్రూరు మండలానికి.. మహబూబాబాద్ నుంచి, రాయపర్తి మండలానికి వరంగల్ నుంచి, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు జనగామ నుంచి ఫైర్ ఇంజిన్ రావాల్సి ఉంటుంది. సుమారు 40 - 50 కి.మీ దూరం నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే తొర్రూరు. రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు 20-25  కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఏ మండలంలో ప్రమాదం జరిగినా సమయానికి ఫైర్ ఇంజిన్ చేరుకునే అవకాశం ఉంటుంది.  
 
పరిధి పెద్దది.. బండి పాతది
 
పరకాల : పరకాల అగ్నిమాపక కేంద్రంలో అన్ని సమస్యలే. వాటర్ లెండర్ వాహనం పాతది. దీన్ని నింపేందుకు నాలుగు గంటలు పడుతోంది. వాటర్ సంప్‌ల్లో నీరు నింపితే ఇంకిపోతోంది. ఫైరింజన్ పికప్‌కే పావుగంట పడుతోంది. ఏయిర్ నింపడానికి వీలుకావట్లేదు. సరిపడా నీళ్లు లేవు. మంటలార్పేందుకు తగినంత సిబ్బంది లేరు. పరకాల పరిధిలో ఆత్మకూరు, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి మండలాలున్నారుు. 15మంది సిబ్బందికి పది మంది మాత్రమే ఉన్నారు. అందులో ఇద్దరు డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్నారు. ఇద్దరు డ్రైవర్ ఆపరేటర్, నాలుగు ఫైర్‌మెన్ పోస్టులు భర్తీ చేయూల్సి ఉంది.
 
రాజయ్య హామీ.. నెరవేరదేమీ..
 
స్టేషన్‌ఘన్‌పూర్ : జిల్లాలో పెద్ద నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు నేటి కీ సన్నాహాలు చేపట్టడం లేదు. ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తహ శీల్దార్ రామ్మూర్తి తన కార్యాలయ ఆవరణలో భూసర్వే నిర్వహించినా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు నేటికీ రాలేదు. అగ్ని ప్రమాదం జరిగితే 28 కిలోమీటర్ల దూరంలోని జనగామ నుంచి లేదా 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ నుంచి ఫైరింజన్ రావాల్సి వస్తోంది.  
 
 అరకొరగా సిబ్బంది..

 
జనగామ: జనగామ అగ్నిమాపక కేంద్రంలో వసతులు కరువయ్యూరుు. 11 మండలాలకు పెద్దిదిక్కుగా ఉన్న ఇక్కడ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫైర్ ఆఫీసర్‌తో కలిపి 16 మంది సిబ్బంది ఉండాలి. కానీ 11 మందే ఉన్నారు. 10 మంది ఫైర్‌మెన్లకు గాను నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నారుు. ముగ్గురు డ్రైవర్ కమ్ ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. సిబ్బందికి అదనపు పని భారం పడుతోంది. నీటి సౌకర్యం లేదు.  బయటకు వెళ్లి ఫైర్‌ట్యాంకర్‌ను నింపుకోవాల్సి వస్తోంది. వేసవిలో వచ్చిపోయే కరెంటుకు ఏ బావి వద్ద నింపుదామన్నా ఇబ్బందే. కార్యాలయ భవనం శిథిలావ స్థకు చేరింది. వర్షాకాలంలో ఉరుస్తోంది. సిబ్బంది విశ్రాంతి గది చాలా చిన్నగా ఉంది. ప్రహరీ నిర్మాణం, నీటి ట్యాంకు మరమ్మతుకు నిధులు మంజూరైనట్లు సమాచారం ఉందని ఫైర్ ఆఫీసర్ బుచ్చి ఎల్లయ్య తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలలో ఫైర్ స్టేషన్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
 ఉన్నాయన్నారు. సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని కోరారు.  
 
ములుగులో  వసతుల లేమి
 
ములుగు : స్థానిక అగ్నిమాపక కేంద్రం ప్రస్తుతం వ్యవసాయశాఖ గోదాంలో కొనసాగుతోంది. ములుగు నుంచి మంగపేట అకినపల్లి మల్లారం వరకు సుమారు 80 కిలో మీటర్ల పరిధి ఉండడం.. ఒకే ఫైర్‌స్టేషన్ ఉండడంతో పూర్తిస్థారుులో సేవలు అందడం లేదు. నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు భూపాలపల్లిలోని గణపురం మండలం చెల్పూరు వరకు అష్టకష్టాలతో సేవలందిస్తున్నారు. 16 మందికి 12 మంది సిబ్బందే ఉన్నారు. 2013లో డిగ్రీ కళాశాల ఆవరణలో 20 గుంటల స్థలం కేటాయించారు. కానీ నిధుల్లేక పనులు ముందుకు సాగలేదు. వర్షాభావ పరిస్థితులతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. అగ్ని ప్రమాదాల నివారణకు నీటి కష్టాలు తప్పేలా లేవు.
 
సకాలంలో అందని సేవలు

 
డోర్నకల్ : నియోజకవర్గంలో మరిపెడలో మాత్రమే ఫైర్‌స్టేషన్ ఉంది. డోర్నకల్, కురవి మండలాలతో పాటు నర్సింహులపేటలోని కొన్ని గ్రామాలకు మహబూబాబాద్ ఫైర్ స్టేషన్ సేవలు అందుతున్నా.. ఫలితమైతే ఉండట్లేదు. మరిపెడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 2007లో అగ్నిమాపక కేంద్రం కాంటాక్ట్ పద్ధతిన ఔట్ సోర్సింగ్ స్టేషన్‌గా ఏర్పాటు చేశారు. ఫైరింజన్‌ను అద్దెకు తీసుకుని 14 మంది సిబ్బందిని కాంటాక్ట్ పద్ధతిన నియమించారు. వరంగల్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి చాలీచాలని వేతనం(రూ. 5000)తో పనిచేయడం కష్టమవుతోందని సిబ్బంది చెబుతున్నారు. అగ్నిమాపక వాహనం కూడా పాత మోడల్ కావడంతో తలుపులు సక్రమంగా పడట్లేదు. నీటి కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని చెరువుకు లేదా ఖమ్మం జిల్లా తిరుమాలాయపాలెం సమీపంలోని కెనాల్‌కు ఫైరింజన్ వెళ్లాల్సి వస్తోంది. ప్రతీ ఆదివారం మరిపెడలో సంత నిర్వహించడం మెయిన్ రోడ్డు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో ఆ రోజు అగ్నిమాపక వాహనాన్ని వేరే ప్రాంతంలో నిలుపుతున్నారు. అగ్నిమాపక కేంద్రం నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి పూర్తిస్థాయి వసతులు కల్పించాలని, వేతనాలు పెంచాలని సిబ్బంది కోరుతున్నారు.
 
ఏడు మండలాలకు  ఒక్కటే..
 
మహబూబాబాద్ : పట్టణంలోని ఫైర్‌స్టేషన్ పరిధిలో మానుకోట, కురవి, డోర్నకల్, తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం, నర్సింహులపేట మండలాలున్నాయి. మానుకోట నుంచి నర్సింహులపేటకు దూరభారం ఉండడంతో సేవలు సమర్థంగా అందడం లేదు. ఈ కార్యాలయంలో బోర్ వేసినా సమృద్ధిగా నీరు లేదు. పట్టణ శివారులోని మున్నేరువాగు, మండలంలోని ఈదులపూసపల్లి చెరువులో నీటి మట్టం తగ్గడంతో ట్యాంకు నింపుకోవడం సమస్యగా మారుతోంది. మున్సిపాలిటీ సిబ్బంది కూడా ట్యాంక్ నింపడానికి ఇబ్బందులు పెడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఫైరింజన్ కండీషన్ అంతంతమాత్రమే. కార్యాలయంలో మరో డ్రైవర్, ఫైర్ మెన్ సిబ్బందిని భర్తీ చేయూల్సి ఉంది.
 
గడువులోగా ఏర్పాటయ్యేనా?
 
వర్ధన్నపేట టౌన్: ఈనెల 11న స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అగ్నిమాపక భవన నిర్మాణానికి 694 చదరపు గజాల స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా అందచేశారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యాలయూన్ని ప్రారంభిస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటి వరకైతే పనులేవీ ప్రారంభం కాలేదు. మరి గడువులోగా పనులు పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. వేసవిలో వర్ధన్నపేట పిరంగి గడ్డ ప్రాంతంలో వరి పొలం అంటుకుని అగ్రిమాపక శకటం సంఘటనా స్థలానికి వచ్చేలోగా బూడిదే మిగిలింది. వరంగల్ నుంచి ఎంత వేగంగా వచ్చినా ట్రాఫిక్ ఇబ్బందులతో గంట సమయం పడుతుంది.
 
కాలితే బూడిదే..
 
భూపాలపల్లి : కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం విచిత్రమే. ఏటా వేసవిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. భూపాలపల్లి, గణపురం, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా పరకాల అగ్నిమాపక కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఫైరింజన్ వచ్చేలోగా ఆస్తులు బుగ్గిపాలవుతున్నారుు. 2010లో భూపాలపల్లి మండలం జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి విద్యార్థుల సర్టిఫికెట్లు, విలువైన కాగితాలు కాలిబూడిదయ్యాయి. 2011లో రాంపూర్ వద్ద దేవాదుల ఎత్తిపోతల పథకానికి చెందిన నాలుగు మోటార్లు కాలిపోగా రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. ఇలా ఏటా జరుగుతున్నా ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
ఒకేసారి రెండు ప్రమాదాలు జరిగితే..
 
పోచమ్మమైదాన్: వరంగల్ ట్రైసిటీలోని లక్షల జనాభాకు తగినట్లుగా వ్యాపారాలు విస్తరిస్తున్నారుు. కానీ, ఏదైనా ఉపద్రవం సంభవిస్తే దాన్ని అరికట్టడం మాట అటుంచి నష్టనివారణ చర్యలకూ సిబ్బంది సరిపడా లేరు.  ట్రైసిటీ మొత్తంగా వరంగల్ మట్టెవాడ, హన్మకొండ బాలసముద్రంలో ఫైర్ స్టేషన్లు మాత్రమే ఉన్నారుు. మట్టెవాడలో మూడు అగ్నిమాపక నిరోధక వాహనాలు ఉండగా ఇందులో ఒకటి మూలన పడింది. ఇక్కడ 21మందికి గాను ఆరుగురు సిబ్బందే ఉన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని ఫైర్ స్టేషన్‌లో ఒకటి పెద్దది, ఇంకోటి చిన్న వాహనం ఉంది. ఇక్కడ పది మందికి ఏడుగురు సిబ్బందే విధుల్లో ఉన్నారు. నగరంలో రెండు చోట్ల ఒకేసారి ప్రమాదాలు జరిగితే మాత్రం సేవలందించడం కష్టతరమవుతోంది.  అగ్నిమాపక కేంద్రాల సంఖ్య పెంచడంతో పాటు సరిపడా వాహనాలు కేటారుుంచాలని ప్రజలు కోరుతున్నారు. పోస్టులు భర్తీ చేసి తమపైభారం తగ్గించాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో  అధికారులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)