amp pages | Sakshi

స్నేక్ గ్యాంగ్‌పై ఐదు కేసులు

Published on Sun, 08/31/2014 - 01:27

  •      నత్తనడకన సాగుతున్న విచారణ
  •      రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు
  •      ముఠా సభ్యులకు పార్టీల అండదండలు!
  • హైదరాబాద్: అత్యాచారాలు, సెటిల్‌మెంట్లతో హైదరాబాద్‌ను హడలెత్తించిన స్నేక్‌గ్యాంక్‌పై పోలీసులు ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేశారు. ఫాం హౌజ్‌లో యువతిపై సామూహిక అత్యాచార ఘట నకు సంబంధించి ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని, 9వ నిందితుడు సాలం హమ్‌దీ(స్నేక్‌గ్యాంగ్ సభ్యులు)లను విచారించిన పహాడీషరీఫ్ పోలీసులు శనివారం వారిని రిమాండ్‌కు తరలిం చారు.

    ఇన్‌స్పెక్టర్ పి.శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకా రం.. గత నెల 31న యువతిపై జరిగిన సాముహిక అత్యాచారం ఘటనతో పాటు మరో నాలుగు కేసులలో స్నేక్‌గ్యాంగ్ సభ్యులు నిందితులు. పాములను పట్టుకున్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద స్నేక్‌గ్యాంగ్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.

    అలాగే, మతాంతర వివాహం చేసుకుందని ముస్లిం యువతిని బెదిరించిన ఘటనలో ఐపీసీ 295ఎ, 506, 509 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇంటిని ఆక్రమించి బెదిరించిన ఘటన, భార్యాభర్తల గొడవలో తలదూర్చి భర్తపై తీవ్రంగా దాడిచేసిన ఘటనలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, స్నేక్‌గ్యాంగ్ బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
     
    సా...గుతున్న విచారణ..
     
    స్నేక్‌గ్యాంగ్ సభ్యులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణను నత్తనడకన సాగిస్తున్నారని  విమర్శలు వస్తున్నాయి. సెటిల్‌మెంట్లు, అత్యాచారాలు చేసి వాటిని తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్న ఈ ముఠా సభ్యులపై కొన్ని ఘటనలకు సంబంధించి మాత్రమే కేసులు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కేవలం నాలుగైదు వీడియోలే లభించాయని, డిలీట్ చేసిన వాటిని రికవరీ చేస్తామని చెప్పారు. కానీ, స్నేక్‌గ్యాంగ్ అకృత్యాలకు బలమైన సాక్ష్యాలుగా నిలిచే ఆ వీడియోలను ఇప్పటివరకు రికవరీ చేయలేకపోయారు.
     

Videos

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)