amp pages | Sakshi

కాకతీయుల కోటలో మువ్వన్నెల జెండా

Published on Tue, 08/12/2014 - 00:12

  • ఖిలా వరంగల్‌లో పంద్రాగస్టు వేడుకలు
  •  సర్కారు గోల్కొండ స్ఫూరితో నిర్ణయం
  •  
    సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యవసాయానికి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుదీర్ఘపాలన సాగించిన కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలావరంగల్‌లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి లో గోల్కొండ కోట ఆవరణలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే స్ఫూర్తి తో గత వైభవాన్ని గుర్తు చేసేలా వరంగల్‌లోనూ కాకతీయ కోటలో ఆగస్టు 15 వేడుకలకు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 
     
    కోట ప్రాంతం ఆవరణలోని ఖుష్‌మహల్ పక్క న ఖాళీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఖిలావరంగల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. కాకతీయుల్లో ముఖ్యురాలైన రాణిరుద్రమదేవి హయాం(1261)లో ఈ కోట నిర్మాణం పూర్తి అయ్యింది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత నిజాం నవాబుల పరిపాలనలో షితాబ్‌ఖాన్ సైన్యాధికారిగా ఉన్నప్పుడు ఖిలావరంగల్‌లో ఖుష్‌మహల్ ను నిర్మించారు. కీర్తి తోరణాలు, ఖుష్‌మహల్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)