amp pages | Sakshi

సూక్ష్మసేద్యానికి నిధులు కరువు

Published on Mon, 01/28/2019 - 01:32

సాక్షి, హైదరాబాద్‌: సూక్ష్మసేద్యానికి బ్రేకులు పడ్డాయి. నిధులు లేకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల ఎకరాలకుగాను కేవలం 70 వేల ఎకరాలకు మాత్రమే పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో ఇంకా ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అందలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,26,054 మంది రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌కు మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉద్యాన శాఖ వద్ద మూలుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులు కేటాయింపులు చేసినా రాష్ట్ర ఆర్థిక శాఖ తన వాటా నిధులు విడుదల చేయడం లేదు. కేంద్రం నుంచి రూ.348 కోట్లు కేటాయింపులు రాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ దానికి రూ.283 కోట్లు కలిపి ఇవ్వాల్సి ఉంది. అవసరాల రీత్యా అదనంగా మరో రూ.263.55 కోట్లు ఇచ్చేలా యాక్షన్‌ ప్లాన్‌కు ఆమోదం కూడా ఇచ్చింది. ఇందులో కేంద్రం రూ.191 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అయితే అందుకు రాష్ట్ర వాటా కలిపి ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా బీసీలకు 90, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం గతంలో నాబార్డు నుంచి రూ.800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది దర ఖాస్తులు, వాటి చెల్లింపులకు పూర్తయింది.  

పదో స్థానంలో రాష్ట్రం... 
దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి వచ్చింది.  అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ పదో స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్తాన్‌లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.  

Videos

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?