amp pages | Sakshi

ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధంకండి

Published on Thu, 03/26/2015 - 01:51

  • వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు
  • వచ్చే నెల 5 లోపు జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలకు కమిటీలు
  • 20వ తేదీలోపు పూర్తి స్థాయిలో మండల కమిటీల నియామకాలు
  • హామీలను నెరవేర్చేలా టీ సర్కారుపై ఒత్తిడి తేవాలని నేతలకు సూచన

  • సాక్షి, హైదరాబాద్: వివిధ సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. దివంగతనేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ అత్యవసర సమావేశం జరి గింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

    ఏప్రిల్ ఐదో తేదీ లోపల పార్టీ జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయాలని... ఏప్రిల్ 20వ తేదీలోపు పూర్తిస్థాయిలో మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలని చెప్పారు. పార్టీని  బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలను నీరుగార్చడంపై ఉద్యమించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రమయిందని.. కరువు పరిస్థితులు ఏర్పడి, కూలీలు వలస బాట పట్టే పరిస్థితి వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని పొంగులేటి చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజలు, రైతులు, కార్మికవర్గం పక్షాన పోరాటాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

    పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కి ష్టారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 70 శాతం బోర్లు ఎండిపోయాయని.. 401 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రోజూ ఎక్కడో ఒకచోట రైతులు ఆత్మహత్య లు చేసుకొంటున్నారని చెప్పారు. సంక్షేమం, సహా యం, అభివృద్ధి అనే మూడు అంశాలపై నడిచిన దివంగత సీఎం వైఎస్సార్.. ప్రజల్లో, కార్యకర్తల గుండెల్లో నిలిచిపోయారని తెలి పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఏ రెహమాన్ మాట్లాడుతూ... అందరం కలిసికట్టుగా పని చేస్తే, నాలుగేళ్ల తర్వాత ఏ పార్టీ వారైనా పొత్తుకోసం లోటస్‌పాండ్ రావాల్సిందేనని పేర్కొన్నారు.

    రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ అభిమానులున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారానే ఎదుర్కొం దామన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జి.నిరంజన్‌రెడ్డి, మతిన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బి. అనిల్‌కుమార్ (ఆదిలాబాద్), వెంకన్నగౌడ్(నల్లగొండ), ప్రభుగౌడ్(మెదక్), జి.సురేష్‌రెడ్డి (రంగారెడ్డి) మాట్లాడగా పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముస్తాఫా అహ్మద్, క్రిస్టియన్ మైనార్టీ విభా గం అధ్యక్షుడు కె.జి.హెర్భట్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీఎస్ విజయచందర్, యూత్ అధ్యక్షుడు బి.రవీందర్, వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రఫుల్లా, వీఎల్‌ఎన్ రెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షులు ఎన్.భిక్షపతి,  పార్టీ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి(వరంగల్), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), ఎస్.భాస్కర్‌రెడ్డి (కరీంనగర్), పార్టీ ప్రధానకార్యదర్శులు జి.నాగి రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.జయరాజు, అధికారప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు.

Videos

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)