amp pages | Sakshi

యూరియా ఆగయా!

Published on Mon, 09/09/2019 - 10:41

సాక్షి, నిజామాబాద్‌: అన్నదాతల ఇక్కట్లు తొలగి పోనున్నాయి. యూరియా కష్టాలు తీరనున్నాయి.. జిల్లాలో కొద్ది రోజులుగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎరువు కోసం రైతులు సొసైటీల వద్ద బారులు తీరి నానా తిప్పలు పడ్డారు. అయితే, యూరియా కొరత తీర్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. తాజాగా ఆదివారం జిల్లాకు 2,551 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. రైలు వ్యాగన్లలో వచ్చిన ఎరువు బస్తాలను గ్రామాలకు పంపిస్తున్నారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకుని అన్ని సొసైటీలకు లారీల్లో సరఫరా చేశారు. జిల్లాలో ని 90 సొసైటీలకు ఇప్పటికే ఎరువు బస్తాలు చేరుకున్నాయి. సోమవారం నుంచి రైతులకు ఎరువు బస్తాలు అందజేయనున్నారు.

ఆందోళన వద్దు.. 
యూరియాకు ఎక్కడా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ అధికారులకు సూచించారు. రైలులో వచ్చిన స్టాక్‌ను సొసైటీలకు తరలించే ప్రక్రియను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. యూరియా సరఫరా పూర్తి కాకముందే అవసరం మేరకు ఇండెంట్‌ పెట్టాలని అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి జిల్లాకు యూరియా స్టాక్‌ వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు రోజుల్లో 3 వేల మెట్రిక్‌ టన్నుల మేర ఎరువులు జిల్లాకు వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని డీఏవో వివరించారు. రైతులకు సరిపడా ఎరువును సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రవాణాలో జాప్యం జరగడం వల్ల కొంత సమస్య ఏర్పడిందని చెప్పారు. ఇక మీదట ఆ సమస్య ఉండబోదని, రైతులకు సరిపడా ఎరువులను సొసైటీలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌