amp pages | Sakshi

రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలు!

Published on Tue, 03/27/2018 - 01:49

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈనెల 27న లేదా 28న ఈ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. రిలయన్స్, మహీంద్రా, బిర్లా తదితర æప్రముఖ సం స్థలు రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించాలని భావిస్తోంది. వీటి అనుమతుల విషయంలో కీలక నిబంధనలు ఉండేలా చూస్తోంది. 

ప్రముఖ సంస్థల ఆసక్తి.. 
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా,  ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు  వర్సిటీలను రాష్ట్రం లో అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ సంస్థలతోపాటు పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలో వర్సిటీల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది.  ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్‌ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బిట్స్‌ పిలానీ) క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉంది. తాజాగా రిలయన్స్‌ సంస్థ ఇక్కడ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరించింది. రాష్ట్రంలో క్యాంపస్‌లున్న గీతమ్‌ డీమ్డ్‌ వర్సిటీ, ఇక్ఫాయ్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో ప్రైవేటు  వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. 

మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా..
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అందించే కోర్సుల ను ప్రైవేటు వర్సిటీల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా జాగ్ర త్తలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్సిటీల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉండే అవకాశం లేదు. ఏ రంగంలోనైనా ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్పించేలా కోర్సులను డిజైన్‌ చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

భవనాలు ఉంటేనే సరిపోదు..
రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు 50 నుంచి 100 ఎకరాల వరకు స్థలాలు ఉన్నాయి. విశాలమైన భవనాలు ఉన్నాయి. అంత మాత్రాన ప్రైవేటు వర్సిటీని స్థాపించేందుకు ముందుకు వచ్చినా వాటన్నింటికి అనుమతివ్వొద్దని భావిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు, బ్రాండ్‌ ఇమేజ్‌ ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని అనుమతిచ్చే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బిల్లులో నిబంధనలను పొందుపరిచినట్లు తెలిసింది. స్థలాలు, భవనాలు చూసి అనుమతులు ఇస్తే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఈమేజ్‌ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున యూనివర్సిటీల మంజూరులో అనేక జాగ్రత్తలు తీసుకునేలా నిబంధనలు సిద్ధం చేసింది. దేశంలో ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలు 300 వరకు ఉంటే అందులో పేరున్నవి 50 కూడా లేవని, అందుకే రాష్ట్రంలో జాగ్రత్తలు అవసరమని అధికారులు భావిస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)