amp pages | Sakshi

గల్ఫ్‌ మిగిల్చిన గాయం

Published on Sat, 03/17/2018 - 09:21

సాక్షి, కామారెడ్డి: నాలుగు రాళ్లు సంపాదించాలని గల్ఫ్‌కు వెళ్లిన ఆ అభాగ్యుడు ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. భార్య, పిల్లల కోసం ఆయన కష్టపడాలనుకుంటే.. ఇప్పుడు ఆయన కోసం కుటుంబం కష్టపడాల్సి వస్తోంది. వైద్యం కోసం లక్షల రూపాయలు   ఖర్చు చేసిన ఆ కుటుంబం చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వా లేదు. ఏదైనా అమ్ముకుని వైద్యం కోసం ఖర్చు పెడదామన్నా ఆస్తిపాస్తులు లేవు. దీంతో మెరుగైన వైద్యం చేయించలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది.

కోన రాజు సొంత ఊరు సిద్దిపేట జిల్లా రామక్కపేట. అయితే బతుకుదెరువు కోసం కామారెడ్డికి వలస వచ్చాడు. పట్టణంలోని స్నేహపురికాలనీలో స్థిరపడ్డాడు. కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2012లో రూ.80 వేలు ఖర్చు చేసి మస్కట్‌కు వెళ్లాడు. అక్కడ ఆరు నెలల పాటు పని చేశాడు. ఒక రోజు పనిచేసే చోట ఇనుపరాడ్‌ తన రెండు కాళ్లకు తగిలింది. తీవ్రంగా గాయపడిన అతడికి అక్కడ వైద్యం చేయించారు. అయితే బ్లడ్‌ క్లాట్‌ అయ్యిందని చెప్పి అతడిని ఇంటికి పంపించారు. ఇంటికి చేరిన తరువాత స్థానిక వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నాడు. ఎంతకూ నయం కాలేదు. రోజురోజుకూ పరిస్థితి విషమించి పూర్తిగా లేవలేని స్థితికి చేరుకున్నాడు.

ఇన్‌ఫెక్షన్‌తో కాళ్లు తొలగించారు...
2013లో ఒక కాలు పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందని కాలును తొలగించారు. మరో రెండేళ్లకు ఇంకో కాలు కూడా ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందని దాన్ని తొలగించారు. రెండు కాళ్లను కోల్పోయిన రాజు పరిస్థితి దయనీ యంగా మారింది. రాజు వైద్యానికి కుటుంబ సభ్యులు దాదాపు రూ.3లక్షలు ఖర్చు చేశారు. అయినా రాజు పరిస్థితి మాత్రం మెరుగుప డలేదు.  రాజు పరిస్థితి నిత్య నరకమే. పడు కోవాలన్నా, కూర్చోవాలన్నా ఇన్‌ఫెక్షన్‌తో పుండ్లు ఇబ్బంది పెడుతున్నాయి. గాయం మానడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలిత మివ్వడం లేదు. మూత్రం వెళితే రక్తం వస్తోంది. మలవిసర్జన చేస్తే రక్తం పడుతోంది. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు వారి దగ్గర చిల్లిగవ్వా లేదు. రోజూ భర్తను చూసు కుంటూనే కుటుంబ పోషణకు ఆయన భార్య సావిత్రి కష్టపడుతోంది.

సర్కారు ఆదుకోవాలి
మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టినం. కాళ్లు లేకున్నా ఎట్లనన్న బతుకు తమని అను కున్నం. కాళ్లు తీసేసినా ఇన్‌ఫెక్షన్‌ మాత్రం పోతలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆయన్నెట్ల బతికించుకోవాలె. మేమెట్ల బతకాలె సారు. మాకు సర్కారు ఏదన్న సాయం చేసి ఆదుకోవాలి. ఎవరైనా మానవతావాదులు ఆదుకోండ్రి.-సేపూరి వేణుగోపాలచారి

Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)