amp pages | Sakshi

ఒక్కరోజే.. 6 లక్షల మొక్కల పంపిణీ

Published on Sat, 08/24/2019 - 10:45

సాక్షి, సిటీబ్యూరో: ప్రతి శుక్రవారం హరితహారం నిర్వహించాలనే లక్ష్యంతో తొలి శుక్రవారం జరిగిన హరితహారంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటడంతోపాటు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో వెరసి 6 లక్షల మొక్కలు  పంపిణీ చేశారు. మేయర్‌ రామ్మోహన్‌  మియాపూర్‌లోని ప్రశాంతనగర్‌లో హరితహారంలో పాల్గొన్నారు.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఫీవర్‌ ఆసుపత్రిలో, అంబర్‌ పేట్‌ ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్‌ అంబర్‌ పేట్‌ విద్యుత్‌ దహనవాటిక  ఖాలీ స్థలంలో మొక్కలు నాటారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి దోమలగూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్‌ తో కలిసి మొక్కలు నాటారు. ఎల్బీనగర్‌ శాసన సభ్యుడు సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ  ఎగ్గె మల్లేశం స్థానిక కార్పొరేటర్లతో కలిసి బండ్లగూడ జి.ఎస్‌.ఐ లో  మొక్కలు  నాటారు.

ఉప్పల్‌ నియోజకవర్గంలో మల్లాపూర్‌ లోని సాయి కాలనీ, టి.బి కాలనీలలోఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మొక్కలను నాటడంతో పాటు స్థానికులకు ఉచితంగా పంపిణీ చేశారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ బుద్వేల్‌ లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే   దానం నాగేందర్‌ స్థానిక కార్పొరేటర్‌ మన్నె కవితతో కలిసి వెంకటేశ్వరకాలనీ, జె.వి.ఆర్‌ పార్కులో మొక్కలు నాటడంతో పాటు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రముఖ చలన చిత్ర నటుడు నరేష్‌ జూబ్లిహిల్స్‌ లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు.జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ , డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, తదితర ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతోపాటు ఉచితంగా పంపిణీ చేశారు.జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌  గురునాథం చెరువుకట్టపై నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. జోనల్, అడిషనల్‌ కమిషన్లు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

Videos

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?