amp pages | Sakshi

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?

Published on Tue, 02/18/2020 - 02:07

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీలు ఉన్నాయని, వాటిల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటూ ఇంటర్‌ బోర్డు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన తీరు చూస్తుంటే గుర్తింపు లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్న సంస్థల పక్షాన ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉన్నట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆ కాలేజీలతో చేతులు కలిపినట్లు, కుమ్మక్కైనట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చే సింది. గుర్తింపు లేని కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై ఏ చ ర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఇంటర్‌ బోర్డుతోపాటు ప్ర భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు అనుమతుల్లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నాయని, సెలవుల్లోనూ కాలేజీలను నడుపుతున్నాయని, వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన రాజేష్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కనీసం 20 వేల మంది విద్యార్థులు గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్నారని, వాళ్ల జీవితాలతో ఆడుకునే అవకాశం ఇంటర్‌ బోర్డు క ల్పించినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే విద్యా సంవత్స రం ప్రారంభంలోనే కాలేజీలకు గుర్తింపు దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌బోర్డు చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. హత్య చేసిన వ్యక్తి ఇక ముందు హత్యలు చేయబోనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే హంతకుడ్ని వదిలేస్తామన్నట్లుగా ఉందంది.  

జరిమానాలు వసూలు చేశాం..: హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీలు లేకుండా ఉన్న భవనాల్లో నారాయణ 28, శ్రీచైతన్య 18 చొప్పున కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు అనుమతి లేకుండానే వాటిలో కాలేజీ లు నిర్వహిస్తున్నాయి. ఇందులో నారాయణ 4, శ్రీచైతన్య 2 కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కా లేజీకి రూ.లక్ష చొప్పున పెనాల్టీ వసూలు చే శాం. ఆ తర్వాతే వాటిని వేరే చోటకు తరలించేందుకు అనుమతి ఇ చ్చాం. సెలవుల్లో కూడా ఆ కాలేజీలు తరగతులు నిర్వహించడంతో రోజుకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించాం. రూ.17 లక్ష లు నారాయణ, రూ.10 లక్షలు శ్రీచైతన్యలకు జరిమానాగా వసూలు చేశాం. నారాయణ, శ్రీచైతన్యలకు 52 హాస్టల్స్‌ ఉన్నాయి. హాస్టల్స్‌పై హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. హైకోర్టు ఆదేశాలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల్లో తనిఖీలు చేశాం’ అని కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.   

జరిమానాలు విధించి వదిలేస్తారా? 
ప్రభుత్వం తరఫున ప్రత్యే క న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ వాదిస్తూ, అఫిలియేషన్‌ లే కుండా కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసు కుంటామని చెప్పారు. నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే 46, 49 చొప్పున కా లేజీలకు అనుమతిచ్చామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. మార్చిలో వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చట్ట ప్రకారం అనుమతులు పొందాలని ఆయా కాలేజీలకు నో టీసులిచ్చినట్లు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీలపై ఏ చర్యలు తీసుకున్నారో ఇంటర్‌ బోర్డు అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 27కి వాయిదా వేసింది. 

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)