amp pages | Sakshi

లా అడ్మిషన్లు ఎలా? 

Published on Thu, 10/05/2017 - 02:14

సాక్షి, హైదరాబాద్‌: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో ప్రవేశాల్లో జాప్యం తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో న్యాయ విద్య ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయినందున ఈనెలలో ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్లను పూర్తి చేయాలన్న ఆలోచనకు కమిటీ సభ్యులు వచ్చారు.

ఇందులో భాగంగా తాత్కాలిక షెడ్యూలును ఖరారు చేశారు. ఈనెల 13వ తేదీన ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీచేసి, 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. 21వ తేదీనుంచి 25వ తేదీవరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 28వ తేదీన సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. అయితే సీట్లను కేటాయించే 28వ తేదీ వరకు బీసీఐనుంచి కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. అవి వస్తేనే సీట్లను కేటాయించనున్నారు. 

నాలుగు నెలలుగా ఎదురుచూపులే.. 
న్యాయ విద్యలో ప్రవేశాలకోసం లాసెట్‌ను గత మే 27న నిర్వహించారు. ఈ పరీక్షకు 40 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితాలను జూన్‌ 10వ తేదీన విడుదల చేశారు. అందులో 18,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారికి అప్పటినుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో బీసీఐ జాప్యం చేస్తూనే ఉంది.

గత ఏడాది ఎల్‌ఎల్‌ఎంలో 524 సీట్లు, మూడేళ్ల లా కోర్సులో 2,590 సీట్లు, 5 ఏళ్ల లా కోర్సులో 1,176 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికే కాకుండా మరిన్ని కొత్త కాలేజీలకు సైతం అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అయితే అనుమతులపై మాత్రం బీసీఐ ఇంతవరకూ తేల్చలేదు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌