amp pages | Sakshi

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Published on Sun, 04/26/2015 - 00:10

- అడ్డుకున్న భవానీనగర్ కాలనీవాసులు
కీసర:
  దమ్మాయిగూడ గ్రామ పరిధిలోని భవానీనగర్‌లోగల అసైన్డ్ భూమిలో (సర్వేనెంబర్ 538 )లోని అక్రమ కట్టడాలను శ నివారం రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చేయడం చిన్నపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లో వెళితే.. గ్రామంలోని సర్వేనెం 538 లోగల సుమారు 20 ఎకరాల అసైన్ట్ స్థలంలో కొందరు రియల్ వ్యాపారులు భవానీనగర్‌పేరట లేఔట్‌ను రూపొందించి నిరుపేదలకు పాట్లు విక్రయించడంతో ఇక్కడ పెద్దఎత్తున కాలనీ వెలిసింది.

ఈ భవానీనగర్‌లో కాలనీల్లో 80 శాతం ఇండ్లు నిర్మించుకోగా మిగతా 20 శాతం మంది బేస్‌మెంట్లు, గుడిసెలు వేసుకున్నారు. ఇండ్లు నిర్మించుకున్న వారు, ఇంటినెంబర్లు, విద్యుత్ బిల్లులు ఉండటంతో ఇటివల ప్రభుత్వం కల్పించిన జీఓ 58 క్రింద పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల ఖాళీ స్థలాల్లో కొందరు బెస్‌మెంట్ల నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు వాటిని కూల్చేయాలని నిర్ణయించారు. కాగా ఇటీవల మండలంలో క్రమబద్ధీకరణ కోసం 58 జీఓ క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్ల పరిశీలన తీరును పరిశీలించేందుకు భవానీనగర్‌ను సందర్శించిన జేసీ అక్రమంగా నిర్మిస్తు న్న బెస్‌మెంట్లను తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

దీంతో శనివారం ఉదయం స్థానిక వీఆర్‌ఓ నాయక్, ఆర్‌ఐ కార్తీక్‌రెడ్డి తమ సిబ్బందితో భవానీనగర్‌కాలనీలో అక్రమంగా నిర్మించిన బెస్‌మెంట్ల ను జేసీబీ సహాయంతో తొలగించే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికులతోపాటు కూల్చివేతలను అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ నేత (సర్పంచ్ భర్త) కాలనీవాసులు జేసీబీకి అడ్డం గా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు కాలనీవాసులను, ప్రజాప్రతినిధులను సముదాయించారు.

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)