amp pages | Sakshi

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు

Published on Sun, 05/22/2016 - 02:21

జేసీ రాంకిషన్
సివిల్ సప్లయ్ రవాణా టెండర్ల ఖరారు

 
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను లారీల ద్వారా టెండర్‌దారులు ఎమ్మెల్‌ఎస్ గోదాంల నుంచి నేరుగా చౌకధర దుఖానాలకు తరలించాలని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎం రాంకిషన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని 24 ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సంబంధించి దాఖలైన టెండర్ దరఖాస్తులను పరిశీలించగా శుక్ర వారం వాయిదా పడిన 18 టెండర్లను శనివారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా జేసీ రాంకిషన్ మాట్లాడుతూ ఎమ్మెల్‌ఎస్ గోదాం నుంచి లారీలు సరుకుల లోడ్‌తో నేరుగా కేటాయించిన గ్రామాలలోని చౌకధర దుఖానాలకు చేరుకోవాలని సూచించారు. ఎమ్మెల్‌ఎస్ గోదాముల నుంచి సరకులు రవాణా చేసే ప్రతీ లారీని జీపీఎస్‌తో అనుసంధానించనున్నట్లు తెలిపారు.

ఈ సారి కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సారి మంచి రేటును నిర్ణయించిందని, క్వింటాలుకు రూ. 12 నుంచి రూ.17ల వరకు ఇస్తోందన్నారు. టెండర్‌దారులు ఈ విషయాన్ని గమనించి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాఖలైన టెండర్లలో నిరే ్ధశించిన రేటు ప్రకారం ఎవరు తక్కువ ధరకు దాఖలు చేస్తే వారికి టెండర్లను అప్పగించారు. ఒకే రేటుకు దాఖలు చేసిన టెండరుదారుల పేర్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో సివిల్‌సప్లై డీఎం బిక్షపతి, డిఎస్వో రాజారావు, మాజీ డీఎం ప్రసాదరావు, టెండర్‌దారులు పాల్గొన్నారు. జిల్లాలోని 24 ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల వారీగా రవాణా టెండర్లు దక్కించుకున్న వివరాలిలా ఉన్నాయి.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)