amp pages | Sakshi

ఈ మహమ్మారి తీరు..చాప కింద నీరు!

Published on Wed, 02/14/2018 - 02:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎయిడ్స్‌ మళ్లీ విజృంభిస్తోంది. జాతీయ సగటు కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారితో మరణిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ 2016–17లో 13.03 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 12,058 ఎయిడ్స్‌ కేసులు నమోదయ్యాయి. 2017–18లో జనవరి 31 వరకు 11.25 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 10,194 మంది కొత్త బాధితులు తేలారు. 40 ఏళ్లు దాటిన వారే ఎక్కువగా ఎయిడ్స్‌ బారి న పడుతున్నారు. బాధితుల్లో 52 శాతం మంది 40 నుంచి 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. 15–49 ఏళ్ల వయసున్న వారితోనే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ(న్యాకో) పేర్కొంటోంది. ఈ వయసున్న వారిలో 6 శాతం మంది ఎయిడ్స్‌ పరంగా ‘హై రిస్క్‌’జోన్‌లో ఉంటారని ఈ సంస్థ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ వయసున్న వారిలో ఆరు శాతం లెక్కన.. 10.50 లక్షల మంది ఉన్నారు. ‘‘40 ఏళ్లు దాటిన వారిలో జీవితపరంగా స్థిరత్వం వస్తోంది. ఆర్థికంగానూ ఇలాగే ఉంటున్నారు. ఎక్కువ మంది ఉపాధి, ఉద్యోగాల కోసం బయటి ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితులో కొత్త వ్యక్తులతో సంబంధాలు ఎయిడ్స్‌కు కారణమవుతున్నాయి’’అని హైదరాబాద్‌లోని ప్రభుత్వ బోధన ఆస్పత్రి వైద్య నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. 

‘ప్రైవేటు’ రోగుల లెక్కలేవి? 
రాష్ట్రంలో ఎయిడ్స్‌ నియంత్రణ విషయంలో సరైన విధానం కనిపించడంలేదు. ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ రాష్ట్ర విభాగం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన వారి సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటోంది. ఎయిడ్స్‌ రోగుల్లో గ్రామీణులు, పేదలు మాత్రమే ప్రభుత్వ ఎయిడ్స్‌ చికిత్స కేంద్రాలకు వస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రులలోనే ఎక్కువ మంది ఎయిడ్స్‌ రోగులు వైద్యం తీసుకుంటున్నారు. వ్యాధి సోకినవారు బయటకి చెప్పుకోవడం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ జరుగుతున్నా.. అక్కడ మందులు తీసుకుంటే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రైవేటు చికిత్సకే మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారెంత మంది అన్న లెక్కలు ప్రభుత్వ విభాగాల వద్ద ఉండటం లేదు. ప్రైవేటు సంస్థలపై పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడంతో ఎయిడ్స్‌ నియంత్రణ విషయంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో జాతీయ సగటును మించి కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో ఒకరికి వ్యాధి ఉన్నట్లు తేలగా.. అదే రాష్ట్రంలో ఆ సంఖ్య రెండుగా ఉంటోంది.

చికిత్స అరకొరే.. 
రాష్ట్రంలో ఏటా కనీసం వెయ్యి మందిని ఎయిడ్స్‌ బలి తీసుకుంటోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటికే 31,416 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,80,937 మంది ఎయిడ్స్‌ రోగులు ఉన్నారు. వీరిలో 90,156 మంది ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. న్యాకో ప్రతి రోగికి ఉచితంగా మందులు సరఫరా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పింఛన్‌ ఇస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ(టీ సాక్స్‌) సంస్థ ఆధ్వర్యంలో మందులు పంపిణీ జరుగుతోంది. రెగ్యులర్‌గా మందులు తీసుకోని వారి విషయంలో టీ సాక్స్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 37,732 మంది ఎయిడ్స్‌ రోగులు క్రమపద్ధతిలో మందులు తీసుకోవడం లేదు. ఫలితంగా వ్యాధి నియంత్రణ సాధ్యం కావడం లేదు.   

సరిపడ ఏఆర్‌టీ కేంద్రాలేవీ? 
ఎయిడ్స్‌ రోగులకు చికిత్స అందించే యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ(ఏఆర్‌టీ) కేంద్రాలు రాష్ట్రంలో 22 మాత్రమే ఉన్నాయి. నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, మెదక్, వనపర్తి, జోగులాంబ, నాగర్‌కర్నూలు, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో ఒక్క ఏఆర్‌టీ సెంటర్‌ లేదు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)